తెలంగాణ అసెంబ్లీలో ఇకపై బీఆర్ఎస్‌ఎల్పీగా కార్యకలాపాలు సాగించనున్న గులాబీ పార్టీ..

By Sumanth KanukulaFirst Published Dec 22, 2022, 5:29 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్‌ పేరు బీఆర్ఎస్‌గా మారింది. ఇకపై టీఆర్ఎస్ఎల్పీ.. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ఎల్పీగా కార్యకలాపాలు  కొనసాగించనుంది. 

తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్‌ పేరు బీఆర్ఎస్‌గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారేందుకు కేంద్ర ఎన్నిలక సంఘం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేతలు తమ పార్టీ పేరును అసెంబ్లీలో బీఆర్ఎస్‌గా గుర్తించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా చార్యులు బులిటెన్ విడుదల చేశారు. దీంతో ఇకపై టీఆర్ఎస్ఎల్పీ.. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ఎల్పీగా కార్యకలాపాలు  కొనసాగించనుంది. 

‘‘తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ (TRSLP) నాయకుడు డిసెంబర్ 22వ తేదీన రాసిన లేఖలో  లెజిస్లేచర్ రికార్డులలో వారి పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ (TRSLP) నుంచి భారత రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ (BRSLP)గా మార్చాలని  స్పీకర్‌ను అభ్యర్థించారు. అవసరమైన చోట.. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీని ఇక నుంచి తెలంగాణ శాసనసభలో భారత రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ గా పరిగణించాలన.. అందుకు అనుగుణంగా రికార్డుల్లో అవసరమైన మార్పులు చేయాలని స్పీకర్ తెలంగాణ అసెంబ్లీని ఆదేశించారు. వెంటనే ఇది అమలులోకి వస్తుంది’’అని బులిటెన్‌లో పేర్కొన్నారు. 

click me!