టీ కాంగ్రెస్‌ పరిస్థితిపై దిగ్విజయ్‌ సింగ్‌కు సంపూర్ణ అవగాహన ఉంది.. భట్టి విక్రమార్క

By Sumanth KanukulaFirst Published Dec 22, 2022, 4:40 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్‌ గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పలువురు నేతలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే సీఎల్పీ నేత మల్ల భటి విక్రమార్క కూడా దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమై చర్చలు జరిపారు.

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్‌ గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పలువురు నేతలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే సీఎల్పీ నేత మల్ల భటి విక్రమార్క కూడా దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. దిగ్విజయ్ సింగ్‌కు తెలంగాణలోని రాజకీయ పరిస్ధితిపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. సమాకాలీన రాజకీయ, సామాజిక అంశాలు అన్నింటిపై దిగ్విజయ్ సింగ్‌తో చర్చించినట్టుగా చెప్పారు. 

ఇక, దిగ్విజయ్‌తో భేటీ అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో పార్టీ అంతర్గత విషయాలు చర్చించానని తెలిపారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్న సీనియర్లు, జూనియర్లు అంతా కలిసే పనిచేస్తున్నారని చెప్పారు. తాము విడిపోయామని భావించడానికి వీల్లేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు. 

Also Read: దిగ్విజయ్‌ ముందే గల్లాలు పట్టుకున్న నేతలు.. గాంధీ భవన్‌లో ఉద్రిక్తత

దిగ్విజయ్ సింగ్‌ పార్టీని ఎలా బలోపేతం చేయాలనేదానిపై చర్చించేందుకు ఇక్కడకు వచ్చారని చెప్పారు. కాంగ్రస్ పార్టీని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారని చెప్పారు. తాను కూడా తన సలహాలు, సూచనలు ఇచ్చానని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేని ధీమా వ్యక్తం చేశారు. 

click me!