సెప్టెంబర్ 3న టీఆర్ఎస్ ఎల్పీ భేటీ: కీలక అంశాలపై చర్చ

By narsimha lodeFirst Published Aug 30, 2022, 11:54 AM IST
Highlights

సెప్టెంబర్ 3వ తేదీన తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు

హైదరాబాద్: సెప్టెంబర్ 3వ తేదీన టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ  భవన్ లో టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు.వచ్చే మాసంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.  రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు జాతీయ రాజకీయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సెప్టెంబర్ 3వ తేదీనే తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. 

తెలంగాణలో బీజేపీ దూకుడుగా వెళ్తుంది. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని టీఆర్ఎస్ భావిస్తుంది. ఈ  విషయమై అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చిస్తారు. పార్టీ ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేస్తారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. మరో వైపు టీఆర్ఎస్ కు సంబంధించిన సంస్థాగత అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించేలా కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవలనే దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించారు.రాష్టరంలో రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను రైతు సంఘాల నేతలు ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో రైతు ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ ధీమా.ను  వ్యక్ం చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ దిశగా  పోరాటం చేయాల్సిన అవసరాన్ని  కేసీఆర్ నొక్కి చెప్పారు.  నిన్న పెద్దపల్లిలో నిర్వహించిన సభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, పార్టీ నేతలతో కేసీఆర్ తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపు బీహార్ లో కేసీఆర్ పర్యటించనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కేసీఆర్ చర్చలు జరుపుతారు. జాతీయ రాజకీయాలలపై నితీష్ తో చర్చించనున్నారు.కొంతకాలంగా బీజేపీపై కేసీఆర్  తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమయం దొరికినప్పుడల్లా కేసీఆర్ విరుచుకు పడుతున్నారు. 

click me!