గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా సైలెంటే, మాట్లాడడం మొదలుపెడితే..: విపక్షాలపై కేటీఆర్ ఫైర్

Published : Mar 06, 2021, 02:26 PM IST
గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా సైలెంటే, మాట్లాడడం మొదలుపెడితే..: విపక్షాలపై కేటీఆర్ ఫైర్

సారాంశం

కేసీఆర్ పై బఫూన్ గాళ్లు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. శనివారం నాడు తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్వీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

హైదరాబాద్: కేసీఆర్ పై బఫూన్ గాళ్లు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
శనివారం నాడు తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్వీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

తెలంగాణ ఉద్యమంలో లేనివారంతా ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం సమయంలో మంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్వీకి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్వీకి కూడ ఉద్యమాలు లేవన్నారు.

నిన్న, ఇవాళ వచ్చిన వాళ్లంతా ఎగెరెగిరి పడుతున్నారని ఆయన మండిపడ్డారు. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడ సైలెంట్ గా ఉంటుందన్నారు. వాడడం మొదలుపెడితే దాని పనితనం కూడ తెలుస్తోందన్నారు. కేసీఆర్ ప్రస్తుతం మౌనంగా ఉన్నారన్నారు. మాట్లాడడం మొదలుపెడితే ఎలా ఉంటుందో తెలుసునని ఆయన చెప్పారు.

దుబ్బాకలో 500 ఓట్లతో విజ.యం సాధించి ఏదో పొడిచినట్టుగా  బీజేపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మనమే నెంబర్ వన్ అని ఆయన చెప్పారు.రాష్ట్రంలోని 131 మున్సిపాలిటీల్లో 121 మున్సిపాలిటీలను కైవసం చేసుకొన్న మనం ఎలా వ్యవహరించాలని ఆయన ప్రశ్నించారు.
 

PREV
click me!

Recommended Stories

Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video