
హైదరాబాద్: మోసాలు చేస్తున్నాడనే ఆరోపణలపై హైదారాబద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మాజీ రంజీ ప్లేయర్ నాగరాజును అరెస్టు చేశారు. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పీఎనంటూ పలు సంస్థలను ఆయన మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడని గుర్తించారు.
నాగరాజు ఫార్మా కంపెనీలను, ఆస్పత్రులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని నుంచి రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శిని మాట్లాడుతున్నానంటూ వ్యాపారవేత్తలకు, కార్పోరేట్ ఆస్పతులకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేశాడని పోలీసులు చెప్పారు.
నాగరాజు కేవలం తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేటీఆర్ పేరు మాత్రమే కాకుండా ఇతర ప్రముఖుల పేర్లను కూడా వాడుకుని మోసాలకు పాల్పడినట్లు చెబుతున్నారు.