హజీపూర్ ఘటనపై స్పందించిన కేటీఆర్... సర్పంచ్ కు ఫోన్ చేసి

By Arun Kumar PFirst Published May 19, 2019, 1:08 PM IST
Highlights

నల్గొండ జిల్లా హజీపూర్ గ్రామంలో జరిగిన దారుణ  ఘటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ గ్రామ సర్పంచ్ కు స్వయంగా ఫోన్ చేసిన కేటీఆర్ అతి త్వరలో గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇలా తనకు కేటీఆర్ ఫోన్ చేశాడన్న విషయాన్ని సర్పంచ్ శ్రీనివాస్ తాజాగా వెల్లడించాడు. 

నిందితుడు శ్రీనివాస్ రెడ్డి చేతిలో అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలను ఆదుకోవాలను ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కోరానన్నాడు. ఈ ట్వీట్ పై స్పందిస్తూ కేటీఆరే తనకు ఫోన్ చేసి మాట్లాడాడని...బాధితులకు  తప్పకుండా ప్రభుత్వం నుండి సహకారం అందేలా చూస్తానని హామీ ఇచ్చాడన్నారు. అంతే కాకుండా ఎన్నికల ఫలితాల  హడావుడి ముగిసిన తర్వాత హజీపూర్ కు తప్పకుండా వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని కేటీఆర్ చెప్పినట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ  విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చాలా బాధపడ్డట్లు కేటీఆర్ తెలిపారు. ఈ దుర్ఘటనపై  ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి నిందితుడికి త్వరగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని  హామీ  ఇచ్చారు. అప్పటివరకు బాధిత కుటుంబాలు కానీ  గ్రామస్తులు గానీ  ఆందోళన చెందవద్దని కేటీఆర్ సూచించినట్లు సర్పంచ్ శ్రీనివాస్ పేర్కోన్నారు.
 
click me!