అంబేద్కర్ విధానాలతోనే... కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర పోరాటం: కేటీఆర్

Siva Kodati |  
Published : Apr 14, 2019, 12:20 PM IST
అంబేద్కర్ విధానాలతోనే... కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర పోరాటం: కేటీఆర్

సారాంశం

భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. 

భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అంబేద్కర్‌కు నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..చిన్న రాష్ట్రాల విషయంలో ఆనాడు అంబేద్కర్ ఆలోచన చేయకుంటే తెలంగాణ ఏర్పడేది కాదని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్.. అంబేద్కర్ విధానాలతోనే ముందుకెళ్లారని చెప్పారు.

కాగా, పంజాగుట్ట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం విషయంలో జరిగిన వివాదంపై కేటీఆర్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో దారుణం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం
ఈ మార్గాల్లో అండ‌ర్ గ్రౌండ్ మెట్రో రైలు.. మార‌నున్న హైద‌రాబాద్‌ ముఖ‌చిత్రం