నాపై కామెంట్సా...?: దేశభక్తిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Aug 10, 2019, 5:32 PM IST
Highlights

మహాత్మగాంధీజీని హత్యచేసిన నాథూరామ్‌ గాడ్సేను దేశ భక్తుడు అంటూ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను తాను సోషల్‌ మీడియాలో ఖండించినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.  ట్విట్టర్ లో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తే తనపైనే కామెంట్స్ రావడం బాధ కలిగించిందన్నారు. నాథూరామ్ గాడ్సేను దేవుడు అన్న ఆమెకు మద్దతు పలకడం బాధకలిగించిందన్నారు.  

హైదరాబాద్‌ : దేశభక్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాతో ఉంటే దేశ భక్తుడివి, లేకపోతే దేశ ద్రోహివి అన్న పరిస్థితులు ప్రస్తుతం దేశంలో దాపురించాయంటూ బీజేపీపై విమర్శలు చేశారు. 

తెలంగాణ వికాస సమితి మూడవ రాష్ట్ర మహాసభలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మగాంధీజీని హత్యచేసిన నాథూరామ్‌ గాడ్సేను దేశ భక్తుడు అంటూ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను తాను సోషల్‌ మీడియాలో ఖండించినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.   

ట్విట్టర్ లో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తే తనపైనే కామెంట్స్ రావడం బాధ కలిగించిందన్నారు. నాథూరామ్ గాడ్సేను దేవుడు అన్న ఆమెకు మద్దతు పలకడం బాధకలిగించిందన్నారు.  

జాతిపితను గౌరవించుకోలేని జాతి మనది అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మతం, జాతీయ వాదం పెనవేసుకొనిపోయాయని తెలిపారు. దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, తర్కించి విభేదించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని స్పష్టం చేశారు. 

ఉదాత్తమైన ఆశయంతో తెలంగాణ వికాస సమితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తరతరాలుగా కులం, మతం అనే తారతమ్యాలు లేకుండా ప్రజలు సుఖసంతోషాలతో జీవనం కొనసాగిస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. 

 

click me!