మున్సిపల్ పోల్స్: వ్యూహాత్మకంగా టీఆర్ఎస్, బీజేపీ పావులు, రెబెల్సే కీలకం

By narsimha lodeFirst Published Jan 24, 2020, 7:55 AM IST
Highlights

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రెబెల్స్ పై కేంద్రీకరించింది. మెజార్టీ మున్సిపాలిటీలను దక్కించుకొనేందుకు ఆ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. 

హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ టిక్కెట్లు దక్కని పార్టీ రెబెల్స్ గా పోటీ చేశారు. రెబెల్స్ ను తమ వైపుకు తిప్పుకొనేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. రెబెల్స్ సహయంతో మరిన్ని మున్సిపాలిటీలను దక్కించుకోవాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. 

also read:టెండర్ ఓటు ఎఫెక్ట్: మహబూబ్ నగ‌లో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు

మున్సిపాలిటీలు, కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 25వ తేదీ వెలువడనున్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రెబెల్స్ ను తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాలను ప్రారంభించింది.

టీఆర్ఎస్ తర్వాత బీజేపీ నాయకత్వం మున్సిపల్ ఛైర్మెన్.డిప్యూటీ ఛైర్మెన్ స్థానాలను దక్కించుకొనే ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా ప్రచారం సాగుతోంది.ఈ మేరకు తమ పార్టీతో కలిసి వచ్చే వారితో చేతులు కలిపేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది.

రాష్ట్రంలోని 10 కార్పోరేషన్లలో బీజేపీ కనీసం 60 నుండి 75 వార్డులను కైవసం చేసుకొనే అవకాశం ఉందని అధికార పార్టీకి సన్నిహితంగా ఉన్న వర్గాలు తెలిపాయి. అయితే ఈ స్థానాలు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకొనేందుకు సరిపోవు.దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకొనేందుకు బీజేపీ నాయకత్వం  ఇతర పార్టీల రెబెల్స్ పై కేంద్రీకరించినట్టుగా సమాచారం.

ఇతర పార్టీల రెబెల్స్ ను తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, జవహార్‌నగర్లలో టీఆర్ఎస్ కు బీజేపీ  నుండి గట్టిపోటీని ఇచ్చింది.కొన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ కంటే  కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

స్వతంత్రులు, రెబెల్స్  మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టుల ఎన్నికల్లో కీలకంగా పని చేయనున్నారు. పార్టీ టిక్కెట్లు దక్కని టీఆర్ఎస్ నేతలు చాలా చోట్ల రెబెల్స్ గా పోటీ చేశారు. కొన్ని చోట్ల పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మరికొందరు నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు.

రెబెల్స్ ను తమ వైపుకు తిప్పుకొనేందుకు టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగింపులను ప్రారంభించింది. మున్సిపల్, కార్పోరేషన్ స్టాండింగ్ కౌన్సిళ్ల ఏర్పాటు సమయంలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా  హామీలు ఇచ్చింది. 

రెబెల్స్ గా బరిలో ఉన్న చాలామంది అభ్యర్థులు పార్టీతో సంబంధాలను కలిగి ఉన్నారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పారు. వారంతా తిరిగి పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు.

click me!