గ్రామపంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా

By narsimha lodeFirst Published Jan 21, 2019, 7:50 PM IST
Highlights

తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌ హవా కొనసాగుతోంది. సోమవారం నాడు 4470 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు టీఆర్ఎస్ అత్యథిక స్థానాలను కైవసం చేసుకొంది.

హైదరాబాద్:  తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌ హవా కొనసాగుతోంది. సోమవారం నాడు 4470 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు టీఆర్ఎస్ అత్యథిక స్థానాలను కైవసం చేసుకొంది.

సోమవారం సాయంత్రం వరకు  అందిన సమాచారం మేరకు  1915 గ్రామ పంచాయితీల్లో  టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు  విజయం సాధించారు.విపక్షాలు మాత్రం టీఆర్ఎస్ కు చాలా దూరంలో ఉన్నాయి. ఇప్పటికే ఏకగ్రీవమైన గ్రామాల్లో కూడ టీఆర్ఎస్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. 603 స్థానాల్లో టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకొంది.కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లో, ఇతరులు 131 స్థానాల్లో ఏకగ్రీవంగా విజయం సాధించారు.


గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పార్టీల బలాలు

టీఆర్ఎస్  2018

కాంగ్రెస్   616

టీడీపీ  19

సీపీఐ 13

సీపీఎం 24

బీజేపీ  46

ఇతరులు 535

click me!