టీఆర్ఎస్ లో టికెట్ల చిచ్చు... భర్త కోసం నిరాహారదీక్షకు దిగిన కార్పోరేటర్

By Arun Kumar PFirst Published Sep 11, 2018, 4:24 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ తెరతీసిన విషయం తెలిసిందే. ఈ ముందస్తు ఎన్నికల కోసం అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాకిచ్చారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఆయన వ్యూహం చాలా చోట్ల ఫలించినప్పటికి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అలజడికి కారణమైంది. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లను ఆశించిన వారు తమ పేరు అభ్యర్థుల జాబితాలో లేకపోయేసరికి పార్టీ అధినాయకత్వంపైనే తిరుగుబాటుకు సిద్దమయ్యారు . దీంతో ఈ అసంతృప్త నాయకులు బహిరంగంగానే పార్టీపై అసమ్మతి గళం వినిపిస్తున్నారు. తమకు టికెట్ ఇవ్వాలంటూ పలు విదాలుగా నిరసనలు తెలుపుతున్నారు.

ఇలా హైదరాబాద్ లోని ఓ మహిళా కార్పోరేటర్ తన భర్తకు టికెట్ కేటాయించాలంటూ నిరాహారదీక్షకు దిగడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.  కూకట్ పల్లి పరిధిలోని బాలాజీ నగర్ కార్పోరేటర్ గా పన్నాల కావ్య హరీష్ చంద్ర రెడ్డి కొనసాగుతున్నారు. ఈమె భర్త పన్నాల హరీష్ చంద్ర రెడ్డి నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతగా కొనసాగుతున్నాడు. దీంతో ఆ సారి టీఆర్ఎస్ పార్టీ నుండి కూకట్ పల్లి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని ఆశించాడు. అయితే పార్టీ అదిష్టానం మాత్ర మళ్లీ సిట్టింగ్ కే అవకాశం కల్పించడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. 

తన భర్తకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో కార్పోరేటర్ కావ్య పార్టీపై నిరసన వ్యక్తం చేస్తోంది. హరీష్ చంద్ర రెడ్డి టికెట్ కేటాయించాలంటూ నిరాహార దీక్షకు దిగడం పార్టీలో సంచలనంగా మారింది. 

click me!