అలయ్ బలయ్ చేసుకుందాం, ఆనందాన్ని పంచుకుందాం: హరీష్ రావు పిలుపు

Published : Dec 10, 2018, 08:20 PM IST
అలయ్ బలయ్ చేసుకుందాం, ఆనందాన్ని పంచుకుందాం: హరీష్ రావు పిలుపు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. అలయ్ బలయ్ చేసుకుందాం, ఆనందాన్ని పంచుకుందాం అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. అలయ్ బలయ్ చేసుకుందాం, ఆనందాన్ని పంచుకుందాం అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

పార్టీ విజయం సాధించిన సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు పూలదండలు, బొకేలు తీసుకురావద్దన్నారు. బాణ సంచాలు అసలు పేల్చొద్దంటూ కార్యకర్తలను, అభిమానులను కోరారు. ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ హరీష్ పిలుపునిచ్చారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో మంచి కార్యక్రమంతో స్వాగతం పలుకుదామని ఆయన అభిమానులను కోరారు. అందుకే పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అంటూ పిలుపునిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu
IMD Rain Alert : ఈ రెండ్రోజులూ భారీ వర్షాలే.. ఈ పది జిల్లాల్లో పవర్ ఫుల్ వానలు, ఇక అతలాకుతలమే