ఈసీ కొత్త రూల్, అభ్యర్థి ఒప్పుకుంటేనే ఫలితం వెల్లడి: సిఈవో రజత్

By Nagaraju TFirst Published Dec 10, 2018, 7:10 PM IST
Highlights

మధ్యాహ్నాం ఒంటిగంటకల్లా తెలంగాణ అసెంబ్లీ ఫలితాల వెల్లడి పూర్తవుతాయని సిఈవో రజత్ కుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చేపట్టిన ఫలితాల సందర్భంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన రజత్ కుమార్ మంగళవారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 
 

హైదరాబాద్: మధ్యాహ్నాం ఒంటిగంటకల్లా తెలంగాణ అసెంబ్లీ ఫలితాల వెల్లడి పూర్తవుతాయని సిఈవో రజత్ కుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చేపట్టిన ఫలితాల సందర్భంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన రజత్ కుమార్ మంగళవారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా 43 పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ జరగబోతుందని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 14 టేబుల్స్ ఉంటాయని తెలిపారు. మెుత్తం 2,379 రౌండ్లు ఉంటాయని తెలిపారు. మెుదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తామని తెలిపారు. 

అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో కొత్త నిబంధనను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రతీ రౌండ్ ఫలితాన్ని అభ్యర్థికి స్టేట్మెంట్ రూపంలో అందజేస్తామని అయితే అభ్యర్థికి అభ్యంతరం లేకపోతే ఫలితాన్ని మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ లో ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. 

మరోవైపు రాష్ట్రంలో అత్యధికంగా శేరిలింగంపల్లిలో అత్యధిక రౌండ్లు ఉంటున్నట్లు తెలిపారు. 42 రౌండ్లలో ఫలితాన్ని వెల్లడిస్తామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అత్యల్పంగా రౌండ్లు ఉన్నాయని 15 రౌండ్లలో బెల్లంపల్లి నియోజకవర్గం ఫలితాలు వెల్లడవుతుందని తెలిపారు. 

కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి లేదన్నారు. సెల్ ఫోన్ తో కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లరాదని సూచించారు. ఏజెంట్లను కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తామని అయితే కౌంటింగ్ జరిగే సమయంలో వారిని బయటకు పంపించమన్నారు. అవసరమైన చోట మాత్రమే వీవీప్యాట్ల కౌంటింగ్ చేపడతామని తెలిపారు.   

click me!