కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని ఈసీని కోరారు టీఆర్ఎస్ నేతలు కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , ఎమ్మెల్సీ భాను ప్రసాద్ నేతృత్వంలోని బృందం ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజుకు వినతి పత్రం సమర్పించారు.
హైదరాబాద్: కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను మునుగోడు ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులకు కేటాయించవద్దని టీఆర్ఎస్ నేతలు ఈసీకి సోమవారం నాడు వినతిపత్రం సమర్పించారు.
మునుగోడు అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని కారు గుర్తును పోలీన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించడం వల్ల ఇబ్బందులు వస్తాయని టీఆర్ఎస్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులు ఈ రకమైన గుర్తుల కారణంగా స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి పాలైన విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ తదితరులు సోమవారం నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజును కలిసి వినతిపత్రం సమర్పించారు. కెమెరా, చపాతీ రోలర్, రోడ్డు రోలర్, టీవీ, కుట్టు మిషన్, పడవ గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరారు.
మునుగోడుఅసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగారు. 2014లో ఈ స్థానం నండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2019లో ఈ స్థానం నుండి మరోసారి బరిలోకి దిగిన ప్రభాకర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ ఉప ఎన్నికల్లో మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
also read:మునుగోడు బైపోల్ 2022: బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు
మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఇవాళే బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 14న కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు.