TRS Plenary: టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

By team teluguFirst Published Oct 25, 2021, 11:59 AM IST
Highlights

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఎన్నికను పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఎన్నికను పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. అంతకుముందు ప్లీనరీ ఆవరణలో సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. అమరవీరులకు నివాళులర్పించారు. వేదిక వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు హోం మంత్రి మహమూద్ అలీ దట్టి కట్టారు. 

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా KCR ఎన్నికైన విషయాన్ని పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు ప్లీనరీ వేదిక మీది నుంచి గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 ఏళ్లు అవుతోంది. టీఆర్ఎస్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే కాకుండా గత ఏడేళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ ను కేసీఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. తనను టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 

Also Read: TRS Plenary: మీరెందుకు గులాబీ చొక్కాలు వేసుకోలేదు?.. కొందరు నేతలతో కేటీఆర్

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ తొమ్మిదోసారి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ను ప్రతిపాదిస్తూ 18 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీలోని అన్ని విభాగాల నాయకులు, అన్ని సామాజికవర్గాల నాయకులు కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి ఇతరులు ఎవరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో కేసీఆర్ ఏకగ్రీవంగా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

హైదరాబాదులోని హైటెక్స్ లో ప్రారంభమైన TRS Plenary వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి అంతకు ముందు కేసీఆర్ పూలమాల వేశారు. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. దానికి ముందు ఆయన టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

ప్లీనరీ వేదిక మీద, సభా ప్రాంగణంలోనే కాకుండా గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని ముఖ్య కూడళ్లలో, ప్రధాన రహదారులపై టీార్ఎస్ జెండాలను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో మహిళలకు, పురుషులకు, మీడీయా ప్రతినిధులకు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రతినిధుల కోసం ప్రధాన ద్వారాల వద్ద 36 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

ప్లీనరీకి హాజరైనవారి కోసం 33 రకాల వంటకాలను సిద్ధం చేశారు. అందరు కలిసి దాదాపు 10 వేల మంది హాజరు అయ్యారు. అదివారం రాత్రి నుంచే వంటకాలు చేయడం ప్రారంభించారు. శాఖాహార, మాంసాహార వంటకాలతో మెనూను సిద్ధం చేశారు. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కిర్రీ, నాటుకోడి పులుసు, ఎగ్ మసాలా, నల్లపొడి ఫ్రై, మటన్ దాల్చా, బోటీ ఫ్రై, పాయా సూప్, తలకాయ పులుసు వంటి మాంసాహార వంటకాలను తయారు చేశారు. 

రాగి ముద్దు, రుమాల్ రోటీ, ఆలూ కాప్సికమ్, బగారా రైస్, తెల్ల అన్నం, వెజ్ బిర్యానీ, మిర్చీ కా సాలన్, గుత్తి వంకాయ కూర. చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, పాలకూర మామిడికాయ పుప్పు, పచ్చి పులుసు, ముద్దపప్పు, సాంబారు, ఉలవచారు. పెరుగు, పెరుగు పచ్చడి, ఆవకాయ, వంకాయ, బీర కాయ పచ్చడి సిద్ధం చేశారు. పలు రకాల స్వీట్లు, ఐస్ క్రీమ్ లు సిద్ధం చేశారు. 

click me!