టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు 33 రకాల వంటకాలను అందించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు వంటలను సిద్దం చేశారు. ఈ వంటలను తయారు చేసేందుకు 350 మందిని నియమించారు.
హైదరాబాద్: Trs plenary కి హాజరయ్యే ప్రతినిధులకు 33 రకాల వంటకాలను సిద్దం చేశారు. Telangana రుచులను ప్రతినిధులకు అందించనున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రసంగం పూర్తైన తర్వాత ప్రతినిధులకు భోజనం అందించనున్నారు. మొత్తం 10 వేల మందికి భోజనం ఏర్పాటు చేశారు.
ఈ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులు 3 వేల మంది ఉంటారు. ప్రతినిధులతో పాటు ప్లీనరీ వద్ద బందోబస్తు విధుల్లో సుమారు 3 వేల మంది పోలీసులున్నారు. మీడియా ప్రతినిధులు ఇతరులు కలిపి సుమారు 10 వేల మంది ఉంటారని నిర్వాహకులు అంచనా వేశారు. వీరిందరికి ఒకే రకమైన భోజనం ఏర్పాటు చేశారు. తెలంగాణ వంటలు ప్రతినిధులకు అందించనున్నారు.
undefined
నాటు కోడి, చికెన్ బిర్యానీ, థమ్ బిర్యానీ, మిర్చి మసాలా, బాగహార రైస్, నాలగు రకాల స్వీట్లు, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు, చామగడ్డ పులుసు, పచ్చి పులుసు,మజ్జిగ పులుసు, తలకాయ కూర, బోటీ, కోడిగుడ్డు పులుసు,బోటీ దాల్చా,మిక్స్ డ్ వెజ్ కుర్మా,,మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు,డొండకాయ, గుత్తి వంకాయ,ములక్కాడ, అంబలి, నాలుగైదు రకాల స్వీట్లను తదితరమైనవి మెనూలో చేర్చారు.
సీఎం KCR, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒకే డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. 400 మంది ఒకేసారి భోజనం చేసేలా ఏర్పాటు చేశారు. మీడియాకు, పోలీసులకు, పురుసులకు, మహిళలకు ప్రత్యేకంగా డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 30 డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. 10 వేల మందికి భోజనాలు తయారు చేసేందుకు నిపుణులైన 350 మందిని నియమించారు. భోజనాలు తయారు చేసే వారికి సహాయంగా 250 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు.