జూపల్లికి టీఆర్ఎస్‌ ఝలక్: కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ ప్లాన్ ఇదీ..

By narsimha lodeFirst Published Jan 26, 2020, 12:41 PM IST
Highlights

కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావుకు టీఆర్ఎస్ నాయకత్వం సాక్ ఇచ్చింది. 


హైదరాబాద్:టీఆర్ఎస్ నాయకత్వాన్ని ధిక్కరించిన వారికి గులాబీ బాస్ సరైన పాఠం చెప్పాలని భావిస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి రెబెల్స్ గా పోటీ చేసిన వారిని పార్టీలో చేర్చుకొనేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ఆసక్తిగా లేదు. 

Also read: కారుకు ప్రమాదం: కొలిక్కి రాని జూపల్లి, హర్షవర్ధన్ వివాదం

ఇతరుల సహాయంతో ఆయా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.ఈ క్రమంలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయుల సహకారం లేకుండా కొల్లాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

Also read:తగ్గని జూపల్లి కృష్ణారావు: టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు చిక్కులు

కొల్లాపూర్ మున్సిపాలిటీలో పార్టీ అధికార అభ్యర్థులకు వ్యతిరేకంగా పార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు పోటీ చేశారు. కొల్లాపూర్ పట్టణంలోని 20 వార్డుల్లో 11 వార్డులను  జూపల్లి కృష్ణారావు మద్దతుదారులు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం 8 వార్డుల్లో మాత్రమే విజయం సాధించారు.

Also read:మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?

ఈ ఫలితాల తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 25వ తేదీ రాత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.

ఆదివారం నాడు ఉదయం కూడ కేటీఆర్‌తో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో తన వర్గీయులు 11 మంది మద్దతు కూడ ఇస్తామని జూపల్లి కృష్ణారావు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి  రెబెల్స్ గా పోటీ చేయించడంపై పార్టీ నాయకత్వం కూడ సీరియస్‌గా ఉంది. 

ఎన్నికలకు ముందే స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తన వర్గీయులను పోటీ నుండి ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం కోరింది.

కానీ, జూపల్లి కృష్ణారావు తన వర్గీయులను బరిలోకి దింపారు. 11 మంది జూపల్లి కృష్ణారావు వర్గీయుల మద్దతు లేకుండానే కొల్లాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకొంటామని టీఆర్ఎస్ నాయకత్వం చెబుతోంది. కొల్లాపూర్ తో పాటు అయిజ మున్సిపాలిటీలో కూడ ఫార్వర్డ్ బ్లాక్ పేరుతో టీఆర్ఎస్ రెబెల్స్ కూడ విజయం సాధించారు.

ఈ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకకొంటామని టీఆర్ఎస్ నాయకత్వం ధీమాగా ఉంది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్  నుండి  విజయం సాధించిన జూపల్లి కృష్ణారావు వర్గీయులు  మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు తెలంగాణ భవన్‌కు ఆదివారం నాడు చేరుకొన్నారు. 

అయితే కొల్లాపూర్ తో పాటు అయిజ మున్సిపాలిటీలను కైవసం చేసుకొనేందుకుగాను ఎక్స్ అఫిషియో సభ్యుల సహకారంతో ఈ మున్సిపాలిటీలను కైవసం చేసుకొంటామని టీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించింది.

click me!