ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు భేటీ అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు గురువారంనాడు భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో చర్చలకు రావాలని కె.కేశవరావు ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలకు రావాలని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఆర్టీసీ కార్మికులను కోరారు. అయితే ఈ చర్చలపై మధ్యవర్తిత్వం వహించాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామరెడ్డి టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావును కోరారు.
undefined
తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు సీఎం కేసీఆర్ తో గురువారం నాడు మధ్యాహ్నం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
ఈ వార్త చదవండి
కేశవరావు ప్రకటనపై తీవ్ర అసంతృప్తి: కేసీఆర్ షాక్
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సెల్ప్ డిస్మిస్ అయినట్టేనని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చల విషయమై సీఎం కేసీఆర్ తో చర్చించేందుకు రెండు రోజులుగా కేశవరావు సీఎం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆర్టీసీ సమ్మెపై కేశవరావు ప్రకటనపై కూడ ఈ విషయమై చర్చ సాగింది. ఆర్టీసీ సమ్మెపై కేశవరావు చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగతమైందని కూడ టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగింది.
ఆర్టీసీ సమ్మెపై చర్చించాలని హైకోర్టు ఇచ్చిన గడువు కూడ ఈనెల 18వ తేదీతో ముగియనుంది. ఈ తరుణంలో కేసీఆర్‌తో కేశవరావు భేటీ అయ్యారు. కేసీఆర్ తో భేటీలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడ ఉన్నారు.
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు తాను కూడ సిద్దంగా ఉన్నానని కేశవరావు సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించినట్టుగా సమాచారం.సీఎం కేసీఆర్ తో పాటు కేశవరావు కూడ హుజూర్‌నగర్ లో జరిగే టీఆర్ఎస్ ఎన్నికల సభలో పాల్గొనే అవకాశం ఉంది.
సమ్మె విరమిస్తేనే చర్చలు ఉంటాయనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. అయితే సమ్మె విరమించే విషయంలో ఆర్టీసీ జేఎసీ నేతలు మెట్టు దిగడం లేదు. టీఎన్‌జీఓ సంఘం కూడ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వానికి మధ్య చర్చలకు సిద్దమని ప్రభుత్వం ప్రకటించింది.
ఇవాళ జరగాల్సిన ఉద్యోగ సంఘాల భేటీ మాత్రం వాయిదా పడింది. బుధవారం నాడు సాయంత్రం నుండి రాత్రి 11 గంటల వరకు సీఎం కేసీఆర్ రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఇతర అధికారులతో సీఎం సమావేశమయ్యారు.ప్రభుత్వంలో ఆర్టీసీలో విలీనం చేసే ప్రకస్తే లేదని సీఎం ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే ఈ భేటీలో సీఎం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారో అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.