ఎంపి కవితకు తీవ్ర అనారోగ్యం...హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు

By Arun Kumar PFirst Published Oct 16, 2018, 2:47 PM IST
Highlights

రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ తరపున నిజామాబాద్ ప్రచార బాధ్యతలను చూసుకుంటున్న ఎంపి కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్నారు. ఇవాళ కూడా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా
పర్యటనలన్నీ రద్దయ్యాయి. 

ఎంపి కవిత తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్పిలో చేర్పించారు. ఈ ఆస్పత్రిలోని ప్రత్యేకంగా కవితకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వారు తెలిపారు.

కవిత అనారోగ్యం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఆమెను పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం రాకతో ఆస్పత్రి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

click me!