సీఐ రాజేందర్ రెడ్డిని దూషించిన ఆడియో నాది కాదు: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

Published : Apr 28, 2022, 11:13 AM ISTUpdated : Apr 28, 2022, 11:24 AM IST
సీఐ రాజేందర్ రెడ్డిని దూషించిన ఆడియో నాది కాదు: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

సారాంశం

తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని తాను దూషించలేదని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. పోలీసులంటే తనకు చాలా గౌరవంగా ఉందన్నారు.

హైదరాబాద్: తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని దూషించినట్టుగా చెబుతున్న ఆడియో తనది కాదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సీఐ అంటే తనకు గౌరవం ఉందన్నారు.గురువారం నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల విషయమై మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు.

ఈ నెల 23న తాండూరులో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులతో కూర్చొన్నా కూడా సీఐ రాజేందర్ రెడ్డి వారించలేదనే ఆగ్రహంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి దూషించారనే ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఆడియో ఆధారంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు Mahender Reddyపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 పోలీసులు తనపై పెట్టిన కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ కేసు విషయమై తనకు నోటీసు ఇస్తే స్పందిస్తానని మహేందర్ రెడ్డి వివరించారు. పోలీసులంటే తనకు గౌరవం ఉందన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంట ఉన్న వారంతా కాంగ్రెస్ నుండి వచ్చారన్నారు. నిజమైన టీఆర్ఎస్ వాదులను కక్ష గట్టి  బెదిరింపులకు దిగుతున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు.  టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై కేసులు పెడుతున్నారన్నారు. పథకం ప్రకారంగా తమ వారిపై కేసులు పెట్టి అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి విమర్శలు చేశారు.

ఒకే పార్టీలో ఉంటూ ఈ విషయమై విమర్శలు చేయవద్దని తాను ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని మహేందర్ రెడ్డి వివరించారు. రౌడీ షీటర్ల విషయాన్ని తాను సీఐ వద్ద ప్రస్తావిస్తానని చెప్పారు.  కానీ తాను సీఐని బెదిరించలేదన్నారు. సీఐని బెదిరించినట్టుగా ఉన్న ఆడియో తనది కాదని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు పద్దతి ప్రకారం చేయిస్తున్నారన్నారు. అనుకోకుండా సంఘటన జరిగిందని మహేందర్ రెడ్డి చెప్పారు. 

తనకు స్థానిక ఎమ్మెల్యే Rohith Reddy ఏం గొడవో అందరికీ తెలుసునని చెప్పారు. Tandurకు వస్తే ఏం జరుగుతుందో తెలుస్తుందని మహేందర్ రెడ్డి  తెలిపారు. తన వెంట రాని వారిపై ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ తరహా అరాచకాలను తాను ప్రశ్నిస్తున్నందుకే తాండూరులో ఇలా జరుగుతుందని మహేందర్ రెడ్డి ఆరోపించారు. 

కర్ణాటకకు ఇసుకను ఎవరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారో కూడా స్థానికులకు తెలుతుసునని చెప్పారు.ఈ విషయాలపై పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని పాయినట్టుగా మహేందర్ రెడ్డి చెప్పారు.  ఎమ్మెల్యే అరాచకాలపై పార్టీ నాయకత్వం చూస్తుందని మహేందర్ రెడ్డి వివరించారు. అయితే దీనికి సమయం రావాల్సిన అవసరం ఉందన్నారు.

TRSలో తాము బలంగా ఉన్నామన్నారు. తన భార్య జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా తాను ఎమ్మెల్సీగా తన సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నాడన్నారు. ఇవన్నీ చూసీ ఓర్వలేకనే పథకం ప్రకారం ఇలా చేస్తున్నారని మహేందర్ రెడ్డి చెప్పారు. గతంలో తాను తాండూరు నుండి ప్రాతినిథ్యం వహించానన్నారు. అయితే తాండూరులో మాత్రం పోలీసులు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. తాండూరు నుండి తాను పోటీ చేస్తానని కూడా మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే  పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. 1994 నుండి ఎమ్మెల్యేగా ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహించానని మహేందర్ రెడ్డి చెప్పారు. తనకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననే నమ్మకం ఉందన్నారు.

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. తాము లేకపోతే ప్రజా ప్రతినిధులు బయటకు రాలేరన్నారు.  ఈ విషయమై ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. అంతేకాదు ఈ విషయమై పట్నం మహేందర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో మహేందర్ రెడ్డి స్పందించారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్