త్వరలో హరీష్ కు శుభవార్త... కీలక నిర్ణయం : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలన ప్రకటన

By Arun Kumar PFirst Published Mar 31, 2019, 1:11 PM IST
Highlights

మాజీ మంత్రి హరీష్ రావుకు త్వరలో టీఆర్ఎస్ పార్టీ సముచిత పదవితో సత్కరించనుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సిద్దిపేట మైనారిటీ నేత ఫరూఖ్ హుస్సేన్ వెల్లడించారు. ఆయనకు తగిన పదవి ఇవ్వడానికి పార్టీ సిద్దంగా వుందని...ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముందని తెలిపారు. హరీష్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పార్టీ కూడా పక్కనపెట్టిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారానికి ఈ ప్రకటనతో తెరపడనుందని ఫరూఖ్ అభిప్రాయపడ్డారు. 

మాజీ మంత్రి హరీష్ రావుకు త్వరలో టీఆర్ఎస్ పార్టీ సముచిత పదవితో సత్కరించనుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సిద్దిపేట మైనారిటీ నేత ఫరూఖ్ హుస్సేన్ వెల్లడించారు. ఆయనకు తగిన పదవి ఇవ్వడానికి పార్టీ సిద్దంగా వుందని...ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముందని తెలిపారు. హరీష్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పార్టీ కూడా పక్కనపెట్టిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారానికి ఈ ప్రకటనతో తెరపడనుందని ఫరూఖ్ అభిప్రాయపడ్డారు. 

శనివారం సిద్దిపేట పట్టణంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో ఫరూఖ్ హుస్సెన్, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాధాకృష్ణ శర్మ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఫరూఖ్ మాట్లాడుతూ... మన నాయకులు, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ను ముఖ్యమంత్రి పార్టీలో ఒంటరివాన్ని చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. త్వరలో హరీష్ తో పాటు మనందరికి మంచి శుభవార్త అందనుందన్నారు. హరీష్ అర్హతకు తగిన మంచి పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని...ఎన్నికల తర్వాత నిర్ణయం వెలువడనుందని ఫరూఖ్ తెలిపారు. 

 గతంలో ట్రబుల్ షూటర్ గా పేరు గాంచి, ప్రతి విషయంలోనూ చురుగ్గా పాల్గొనే హరీష్ రావును ఆయన సొంత నియోజకవర్గం సిద్ధిపేటకు మాత్రమే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. శాసనసభ్యులు కొందరు ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అలాంటి చర్యలకు శాసనసభ్యులు స్వస్తి చెప్పాలని ఆ మధ్య టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు కూడా. కేటీఆర్ హెచ్చరిక హరీష్ రావుకు కూడా వర్తిస్తుందనే ప్రచారం సాగుతోంది.  గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ హరీష్ రావు పార్టీ తరఫున కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన కేవలం సిద్ధిపేటకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితిని కేసిఆర్ కల్పించారని ప్రచారం జరుగుతోంది. 

టీఆర్ఎస్ నేతలు కూడా హరీష్ రావును కలవడం మానేశారు. పార్టీ టికెట్లు పొందిన నేతలు, పదవులు దక్కించుకున్న నేతలు గతంలో హరీష్ రావును తప్పకుండా కలిసి ధన్యవాదాలు చెప్పేవారు. ఇప్పుడు కేవలం కేటీఆర్ ను, పార్లమెంటు సభ్యురాలు కవితను మాత్రమే కలుస్తున్నారు. ఇటీవల మంత్రి పదవులు దక్కినవారు వారిద్దరినే కలిసి ధన్యవాదాలు తెలిపారు. వారు హరీష్ రావును కలుసుకోలేదు. లోకసభ టికెట్లు దక్కించుకున్నవారు కూడా కవితను, కేటీఆర్ ను మాత్రమే కలిశారు.  

శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించిన తర్వాత కేసీఆర్ హరీష్ రావును పూర్తిగా విస్మరించడం ప్రారంభించారనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ ఆయనకు ఏ విధమైన పాత్ర లేకుండా పోయింది. ఓ సాధారణమైన ఎమ్మెల్యేగా మిగిలిపోయే పరిస్థితిని కేసీఆర్ కల్పించారు. ఎప్పుడో గానీ హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లడం లేదు.  ఇలా హరీష్  ప్రాధాన్యత తగ్గడంతో ఆయన వర్గాన్ని రెచ్చగొట్టి టీఆర్ఎస్ లో చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే టీఆర్ఎస్ అధిష్టానం హరీష్ కు మంచి పదవిని కేటాయించడం ద్వారా ప్రతిపక్షాల ఎత్తును చిత్తుచేయాలని చూస్తోంది. ఈ సమయంలో ఫరూఖ్ తాజా ప్రకటన సంచలనంగా మారింది. 
 

నాని vs విజయ్ దేవరకొండ: బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

click me!