ఉనికి కోసమే రేవంత్ రెడ్డి జోకర్ మాటలు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

By narsimha lodeFirst Published May 22, 2022, 5:16 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోకర్ మాటలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డిలు ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు.
 

హైదరాబాద్:ఉనికి కోసమే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోకర్ మాటలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డిలు విమర్శించారు.ఆదివారం నాడు వరంగల్ లో  TRS ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. Telangana ఉద్యమ సమయంలో చంద్రబాబు స్క్రిప్ట్ లో Revanth Reddy పాత్రదారుడన్నారు. అక్కంపేటలో నిర్వహించిన Ryhtu Rachabanda  రచ్చబండలో రైతులే లేరని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Dharma Reddy, Vinay Bhaskar లు విమర్శించారు.కొడంగల్ కి వస్తా నువ్వు చేసిన అభివృద్ది ఏమిటో చూపించాలని  చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు.రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు చేసే కార్యక్రమాలను Congress పార్టీ నేతలు వివరిస్తున్నారు.

also read:పంట రుణాలు చెల్లించొద్దు, అధికారంలోకి రాగానే మాఫీ: తునికిమెట్లలో రేవంత్ రెడ్డి హామీ

జయశంకర్ సార్ గురించి రేవంత్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ బండికి జయశంకర్, కేసిఆర్ లు జోడు ఎద్దులుగా పనిచేశారని చెప్పారు.ఉద్యమ సమయంలో చంద్రబాబు స్క్రిప్ట్ లోరేవంత్ రెడ్డి  పాత్రదారుడిగా ఉన్నారని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. జయశంకర్ సార్ ను స్మరించుకోవడానికే జిల్లాకు పేరు పెట్టామని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీల ప్రత్యామ్నాయం కోసమే అనేక రాష్ట్రాలు కేసిఆర్ ను కోరుకుంటున్నాయని వినయ్ భాస్కర్ అన్నారు.

రైతు ఉద్యమంలో అమరులైన వారిని ఆదుకుంటే కాంగ్రెస్, బీజేపీ లకు భయమెందుకని ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ ను ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ లా ప్రవర్తించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. జయశంకర్ సార్ స్వగ్రామానికి వచ్చి చిల్లర మాటలు మాట్లాడారని మండిపడ్డారు.రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల మధ్య రచ్చ జరిగిందన్నారు ధర్మారెడ్డి. రైతు డిక్లరేషన్ 6 ఏండ్ల క్రితమే కేసిఆర్ తీసుకొచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దండగ అన్న వ్యవసాయాన్ని పండగ చేశామని తెలిపారు. ఆపద్బంధు  పథకంతో కాంగ్రెస్ రైతులను ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. 5 లక్షల రైతు బీమా 10 రోజుల్లో అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలిత రైతులు తెలంగాణకు ఎందుకు వస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. అక్కంపేట రచ్చబండలో అసలు రైతులే లేరన్నారు. కొడంగల్ కి వస్తా నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని  రేవంత్ రెడ్డి అంటూ సవాల్ చేశారు.  
 


 

click me!