విరాళాల విషయంలో వెనక్కి తగ్గిన విద్యాసాగర్: క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే విద్యాసాగర్

Published : Jan 22, 2021, 01:41 PM IST
విరాళాల విషయంలో వెనక్కి తగ్గిన విద్యాసాగర్: క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే విద్యాసాగర్

సారాంశం

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ ఈ వ్యాఖ్యల విషయంలో వెనక్కు తగ్గారు.  

కోరుట్ల: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ ఈ వ్యాఖ్యల విషయంలో వెనక్కు తగ్గారు.

తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆయన కోరారు.  అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పినట్టుగా ఆయన తెలిపారు.

తాను రాముడిని భక్తుడినేనని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అయోధ్యకు కూడ వెళ్లినట్టుగా ఆయన తెలిపారు. బీజేపీ మత రాజకీయాలు మానుకొంటే మంచిదని ఆయన హితవు పలికారు. అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణానికి తాను విరాళం ఇస్తానని ఆయన చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu
KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu