ఏడాదిలో సిద్దిపేటకు రైలు : మంత్రి హరీష్

By AN TeluguFirst Published Jan 22, 2021, 1:26 PM IST
Highlights

ఏడాదిలో సిద్దిపేటకు రైల్ వస్తుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని 14, 28 వార్డ్‌లలో సీసీ రోడ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో వంద ఏండ్ల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించామని తెలిపారు.

మన ఇంటిలో గచ్చు తరహాలో వీధిలో సీసీ రోడ్ నిర్మిస్తున్నామని చెప్పారు. సిద్దిపేటలో ఐదు ఏండ్లలో వెయ్యి కోట్ల అభివృద్ది పనులను చేశామన్నారు. హైదరాబాద్ నుండి ప్రజలు సిద్దిపేట రంగనాయక సాగర్‌కు వచ్చేలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 

వ్యర్థం నుండి కూడా అర్ధం వచ్చేలా వ్యర్ధం నుండి ఇటుకల తయారీ చేస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. అభివృద్ధిలో భాగంగా ఏడాదిలో సిద్ధిపేటకు రైలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. 

click me!