గడ్డం తీయను: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య శపథం

Published : Feb 15, 2021, 08:58 PM IST
గడ్డం తీయను: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య శపథం

సారాంశం

పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన లక్ష్యం పూర్తి చేసే వరకు గడ్డం తీయనని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ప్రకటించారు. పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో పార్టీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని కేసీఆర్ ఆదేశించారు.

వరంగల్:పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన లక్ష్యం పూర్తి చేసే వరకు గడ్డం తీయనని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ప్రకటించారు. పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో పార్టీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని కేసీఆర్ ఆదేశించారు.

జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాజయ్య  పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీరియస్ గా  తీసుకోవాలని ఆయన పార్టీ నేతలను కోరారు. సభ్యత్వ నమోదును రాజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.  ఈ నెల 12వ తేదీ నుండి తాను గడ్డం పెంచుతున్నట్టుగా చెప్పారు.

తానెప్పుడూ గడ్డం పెంచలేదన్నారు. గతం కంటే నియోజకవర్గంలో తనకు ఇచ్చిన లక్ష్యం నెరవేరేవరకు ఎట్టి పరిస్థితుల్లో గడ్డం తీయనని ఆయన శపథం చేశారు. 60 వేల సభ్యత్వాలను 15 రోజుల్లో పూర్తి చేసే వరకు గడ్డం తీయనని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం