ఆర్టీసీ సమ్మె మావాళ్ల కుట్రే : టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published : Oct 15, 2019, 11:33 AM ISTUpdated : Oct 15, 2019, 11:44 AM IST
ఆర్టీసీ సమ్మె మావాళ్ల కుట్రే : టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

సమ్మెకు కారణం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణమని స్పష్టం చేశారు. ఆర్టీసీకి ఆజ్యం పోస్తుంది తమ పార్టీకి చెందిన నేతలే కావడం బాధాకరమన్నారు. ఇలాంటి కారణాల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఆర్టీసీ సమ్మె వెనుక ఉన్నది తమ పార్టీకీ చెందిన నేతలేనంటూ కీలక వ్యాక్యలు చేశారు. 

కొంతమంది తమ పార్టీకి చెందిన కీలక నేతలే ఆర్టీసీ సమ్మె వెనుక ఉన్నారని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. ఆ నేతలు ఎవరో అన్నది తనకు పూర్తిస్థాయి సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తిస్థాయి వివరణను ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్తానన్నారు. 

సమ్మెకు కారణం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణమని స్పష్టం చేశారు. ఆర్టీసీకి ఆజ్యం పోస్తుంది తమ పార్టీకి చెందిన నేతలే కావడం బాధాకరమన్నారు. ఇలాంటి కారణాల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందన్నారు. పార్టీకే కాదని ప్రజలకు కూడా నష్టమన్నారు ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. 

ఇప్పటి వరకు తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు, పలువురు మంత్రులు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక రాజకీయ శక్తుల కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆర్టీసీ సమ్మె వెనుక ఉండి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ నెట్టుకువస్తుంది ప్రభుత్వం. 

సీఎం కేసీఆర్, మంత్రులు విపక్షాల కుట్రే సమ్మెకు కారణమంటూ ఆరోపణలు చేస్తుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాత్రం రివర్స్ గాకౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె కుట్ర వెనుక తమ పార్టీకి చెందిన నేతలే ఉన్నారని వ్యాఖ్యానించారు. ముత్తిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. 


 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఒకేసారి ఎండలు, వానలు
Pawan Kalyan మీద దేశద్రోహం కేసు పెట్టాలి: Kalvakuntla Kavitha | Asianet News Telugu