టిఆర్ఎస్ ముత్తిరెడ్డికి మరో షాక్

First Published Jan 13, 2018, 2:22 PM IST
Highlights
  • సిట్టింగ్ ఎంపిటిసి ఎన్నికలో టిఆర్ఎస్ ఓటమి
  • రెండుసార్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన ముత్తిరెడ్డి
  • 94 ఓట్ల తేడాతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి వేణు
  • కరీంనగర్ లో 2 చోట్ల టిఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు

టిఆర్ఎస్ పార్టీలో వరుస షాక్ లతో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సతమతమవుతున్నారు. మొన్నటి వరకు జిల్లా కలెక్టర్ గా ఉన్న శ్రీ దేవసేన ఈ ఎమ్మెల్యేను గుక్క తిప్పుకోనివ్వలేదు. ఆయన అవినీతి అక్రమాలను బట్టబయలు చేసి సంచలనం సృష్టించింది. దీంతో అధినేత మీద వత్తిడి తెచ్చి ఆమె గండం నుంచి ముత్తిరెడ్డి గట్టెక్కారు. ఆమెను బదిలీ చేయించారు. హమ్మయ్య అనుకుంటున్న తరుణంలో మరో షాక్ ఆయనకు తప్పలేదు. ఆ వివరాలు తెలియాలంటే చదవండి.

సిద్ధిపేట జిల్లాలోని చేర్యాల మండలం ఆకునూరు 1 ఎంపిటిసి స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అబ్యర్ది తాటికొండ వేణు 94 ఓట్లతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. అతి చిన్న ఎంపిటిసి స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రెండుసార్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. కానీ ఆయనకు ఊహించని షాక్ తగిలింది. జనాలు టిఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టి ముత్తిరెడ్డికి హెచ్చరిక పంపారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి నర్సవ్వను జనాలు ఓడగొట్టారు. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి వేణు ఫొటో కింద చూడొచ్చు.

టిఆర్ఎస్ అభ్యర్థి నర్సవ్వకు 661 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ వేణుకు 755 ఓట్లు వచ్చాయి. బిజెపికి 73, సిపిఐ 71, సిపిఎం కు 34 ఓట్లు వచ్చాయి. అయితే ఈ స్థానంలో గతంలో ఉన్న టిఆర్ఎస్ ఎంపిటిసి మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక ద్వారా జనగామలో ముత్తిరెడ్డికి ఎదురుగాలి వీస్తోందన్న వాతావరణం టిఆర్ఎస్ పార్టీ పెద్దలకు అర్థమైపోయిందంటున్నారు.

కరీంనగర్ లో టిఆర్ఎస్ కు భారీ షాక్

జనగామ ముచ్చట ఇలా ఉంటే.. ఇక టిఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ జిల్లాలోనూ ఎదురుగాలి వీచింది. జిల్లాలోని గంగాధర మండల కేంద్రములో, ఆసంపల్లిలో జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు టిఆర్ఎస్ కు చేదు ఫలితాన్నిచ్చాయి. ఆసంపల్లి లో టిఆర్ఎస్ అభ్యర్థి  పై కాంగ్రెస్ అభ్యర్తి మనోహర్ 832 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గంగాధర ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్తి పై బిజేపి అభ్యర్థి పెరుక శ్రావణ్ 1252 ఓట్లతో విజయం సాధించారు. ఈ జిల్లాలోని రెండు చోట్ల కూడా టిఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు కావడం గమనార్హం.

ఇక కామారెడ్డి జిల్లాలో జరిగిన ఉప ఎన్నికలోనూ అధికార టిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది. జిల్లాలోని మద్నూర్ ఎంపిటిసి 2 కు  జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రాములు ఘన విజయం సాధించారు. బీజేపీ రాములు 737 ఓట్గెలు రాగా.. రెండో స్థానంలో టిఆర్ఎస్ నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్ కు ౩౩౩ ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాలు కు 323 వచ్చాయి.

click me!