ఖైరతాబాద్ గణపయ్యను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

Published : Sep 06, 2022, 11:09 PM IST
ఖైరతాబాద్ గణపయ్యను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

సారాంశం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని విఘ్నేశుడికి విజ్ఞాపనలు చేసింది. ఈ సందర్భంగా 50 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేసిన ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీకి ఆమె అభినందనలు తెలిపారు.  

హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేషుడు ఫేమస్. నగరంలోని వాసులు దాదాపుగా ఈ విఘ్నేషుడిని తప్పక దర్శించుకుని తీరుతారు. ప్రతి యేటా కన్నుల పండువగా గణనాథుడు ఇక్కడ దర్శనం ఇస్తుంటాడు. అందరిలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె లంబోదరుడి గురించి మాట్లాడారు.

ఖైరతాబాద్ వినాయకుడిని ప్రజలంతా కొంగు బంగారంలా కొలుస్తారని ఆమె అన్నారు. ప్రజలు ఈ విఘ్నేశుడి కోసం ఏడాదంతా ఎదురు చూస్తారని చెప్పారు. అలాంటి గణనాథుడిని తాను దర్శించుకున్నందుకు సంతోషంగా ఉన్నదని వివరించారు.

ఖైరతాబాద్‌లో 50 అడుగుల మట్టి విగ్రహాన్ని నిలబెట్టిన సంగతి తెలిసిందే. తొలిసారి ఇక్కడ మట్టి విగ్రహాన్ని పెట్టారు. ఈ విశేషాలనూ కల్వకుంట్ల కవిత ప్రస్తావించారు. ఖైరతాబాద్‌లో 50 అడుగుల గణపతిని మట్టితో తయారు చేయడం ఒక గొప్ప సందేశం వంటిదని అభిప్రాయపడ్డారు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ మట్టి విగ్రహాన్ని తయారు చేసినందుకు ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవ కమిటీ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆమె ఖైరతాబాద్ వినాయకుడికి ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, చైర్మన్లు గజ్జల నగేష్, మేడే రాజీవ్ సాగర్‌లు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?