అడవిలో శవం..వారం రోజులుగా చెట్టుకు వేలాడుతూ...

sivanagaprasad kodati |  
Published : Nov 01, 2018, 07:57 AM IST
అడవిలో శవం..వారం రోజులుగా చెట్టుకు వేలాడుతూ...

సారాంశం

ఓ వ్యక్తి మృతదేహం వారం రోజులుగా చెట్టుకు వేలాడుతున్న ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.... నేపాల్ దేశానికి చెందిన సుకుమ్ బహదూర్ అనే వ్యక్తి చెంగిచర్లలోని ఐవోసి వద్ద నివసిస్తూ లేబర్‌గా పనిచేస్తున్నాడు

ఓ వ్యక్తి మృతదేహం వారం రోజులుగా చెట్టుకు వేలాడుతున్న ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.... నేపాల్ దేశానికి చెందిన సుకుమ్ బహదూర్ అనే వ్యక్తి చెంగిచర్లలోని ఐవోసి వద్ద నివసిస్తూ లేబర్‌గా పనిచేస్తున్నాడు..

తాగుడుకు బానిసగా మారడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు.. ఈ క్రమంలో చెంగిచర్ల ప్రధాని రహదారి పక్కనున్న అడవిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతోందని స్థానికులు పోలీసులకు సమాచారం  అందించారు.

సుమారు వారం రోజులుగా చెట్టుకు వేలాడుతూ ఉందని వారు తెలిపారు. ఆ మృతదేహం సుకుమ్‌దేనని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక  ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌