కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్

Published : Sep 25, 2018, 02:16 PM ISTUpdated : Sep 25, 2018, 03:19 PM IST
కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్

సారాంశం

గతంలో ఉద్యమకారులపై ఎన్ని దౌర్జన్యాలు చేసినా పెద్దమనసుతో కొండా దంపతులను క్షమించారన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తామని తమరు చెప్పారని గుర్తుచేశారు. 

కొండా దంపతులకు మతిభ్రమించిందని, అందుకే కేసీఆర్, కేటీఆర్ పై అలాంటి కామెంట్లు చేస్తున్నారని టీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. కొద్ది సేపటి క్రితం కొండా సురేఖ దంపతులు మీడియా సమావేశంలో కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. దీనిపై టీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ స్పందించారు. కొండా దంపతులు మతిభ్రమించి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును సురేఖ చదివారని ఆయన విమర్శించారు. దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లకు కొండా దంపతులు కేరాఫ్ అడ్రస్ అని దుయ్యబట్టారు. కొండా దంపతులకు టీఆర్‌ఎస్ రాజకీయ పునర్జన్మనిచ్చిందని...కేటీఆర్‌పై కొండా దంపతులు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఉద్యమంలో కేటీఆర్‌, కవిత చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. కొండా కుటుంబానికి టికెట్ ఇవ్వకపోవడంతో వరంగల్ ఈస్ట్‌లో ప్రజలు సంబురాలు చేసుకున్నారని వినయ్ భాస్కర్ తెలిపారు.
 
తెలంగాణ వచ్చాక కొండా దంపతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, తన మేనల్లుడి ద్వారా తన దగ్గరకు వచ్చారన్నారు. కొండా సురేఖను కేటీఆర్‌ దగ్గరికి తాను తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. గతంలో ఉద్యమకారులపై ఎన్ని దౌర్జన్యాలు చేసినా పెద్దమనసుతో కొండా దంపతులను క్షమించారన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తామని తమరు చెప్పారని గుర్తుచేశారు. మళ్లీ ఏకగ్రీవంగా మురళి ఎమ్మెల్సీ అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వినయ్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu