పార్టీకి కొందరు ద్రోహం చేశారు ... వాళ్ల సంగతి మీరే చూడాలి : కార్యకర్తలతో భేటీలో తుమ్మల వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 27, 2022, 02:52 PM IST
పార్టీకి కొందరు ద్రోహం చేశారు ... వాళ్ల సంగతి మీరే చూడాలి : కార్యకర్తలతో భేటీలో తుమ్మల వ్యాఖ్యలు

సారాంశం

టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. పార్టీకి కొందరు ద్రోహం చేశారని.. తాను పాలేరులో పెద్ద పాలేరులా పనిచేశానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ద్రోహం చేసిన వారి సంగతి మీరే ఆలోచించాలంటూ కార్యకర్తలకు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 

టీఆర్ఎస్ (trs) సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు (tummala nageswara rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు పార్టీకి ద్రోహం చేశారని.. వారి సంగతి మీరే ఆలోచించాలని కార్యకర్తలకు తుమ్మల పిలుపునిచ్చారు. తాను భిక్షమేసే మనిషిని కాదని.. మీరే పది మందికి భిక్షమిచ్చే స్థాయికి తీసుకొస్తానని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పాలేరులో పెద్ద పాలేరులా పనిచేశానని.. 70 ఏళ్లలో లేని అభివృద్ధిని మూడేళ్లలో చేశానని తుమ్మల గుర్తుచేశారు. పార్టీలకతీతంగా ప్రజల కష్టాలు తీర్చానని ఆయన వ్యాఖ్యానించారు. 

అంతకుముందు ఏప్రిల్ నెలలోనూ తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలతో మాట్లాడుతూ.. మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అయితే మనం పార్టీలో ఉన్నందున ఎక్కడ తొందర పడవద్దని సూచించారు. చెప్పారు. తాను పదవిలో ఉన్నప్పుడు  ప్రతి పక్ష పార్టీలకు సంబంధించిన వారిపై కూడా ఎటువంటి వివక్షత చూపించలేదని చెప్పారు. ఇప్పుడు సొంత పార్టీ వారికే వేధింపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లర వ్యక్తులను పట్టించుకోవద్దని అన్నారు. రాజకీయాల్లో కావలసింది ఓపిక అని అన్నారు. ఓపిక పడితే కార్యకర్తలే రాజులు అవుతారని చెప్పారు. 

‘మనల్ని ఇబ్బందిపెట్టేవారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తుల గురించి పట్టించుకుంటే.. మనకున్న పరువు, ప్రతిష్టలే  దిగజారిపోతాయి. కాబట్టి మన పనేదో మనం చేసుకోవాలి. నమ్ముకున్న ప్రజల కోసం పని చేయాలి. భగవంతుడు ఇచ్చిన అవకాశాల మేరకు జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలు చేసే అవకాశాలు చేసే అదృష్టం దక్కింది. 

Also Read:రాజకీయ ద్రోహులను నమ్మొద్దు: తుమ్మల నాగేశ్వరరావు సంచలనం

భవిష్యత్తులో కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. కక్షలు, కార్పణ్యాలు లేకుండా ఉంటాను. నేను పదవిలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు పార్టీలపై ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. సొంత పార్టీ వాళ్లనే ఈ రకంగా చేస్తున్నారంటే.. దానిని వాళ్ల విజ్ఞతకే వదిలేద్దాం. కొద్ది రోజులు ఓపిక పట్టండి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. నేను మీ కోసం ఉంటానని చెప్పారు.  

మనతోని ఉండే వ్యక్తులను ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో అందరూ చూస్తున్నారు. మనం పార్టీలో ఉన్నాం కాబట్టి దాన్ని బజారున పడేసే ఉద్దేశం మనకు లేదు. అటువంటి వ్యక్తులకు భవిష్యతులో పార్టీ ఏ రకమైన ఆదేశాలు ఇస్తుందో చూద్దాం. మనం ఎక్కడా కూడా తొందరకపడకుండా.. వాళ్లు కవ్వించినా, బాధపెట్టిన పట్టించుకోవద్దు. మీరు ఎవరినా కూడా ఇబ్బంది పెట్టొద్దు’అని తుమ్మల కార్యకర్తలను కోరారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?