ఆదిలాబాద్ జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి: పోలీసుల దర్యాప్తు

Published : May 27, 2022, 02:33 PM ISTUpdated : May 27, 2022, 05:10 PM IST
ఆదిలాబాద్ జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి:  పోలీసుల దర్యాప్తు

సారాంశం

ఆదిలాబాద్ జిల్లాలో  రాజేశ్వరీ అనే యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. యువతి ఆత్మహత్య చేసుకొందని పేరేంట్స్ చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్: Adilabad జిల్లాలో శుక్రవారం నాడు రాజేశ్వరీ అనే యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె గొంతు కోసినట్టుగా ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. రాజేశ్వరీ ఆత్మహత్య చేసుకొందని పేరేంట్స్ చెబుతున్నారు. అయితే రాజేశవరీ తల్లిదండ్రులపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Rajeshwari ఆత్మహత్య చేసుకొందా లేదా తల్లిదండ్రులు చంపారా మరేవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. వేరే మతానికి చెందిన యువకుడిని రాజేశ్వరీ ప్రేమించడం పేరేంట్స్ కు నచ్చలేదనే ప్రచారం కూడా లేకపోలేదు. ఈ ఘటన నార్నూర్ మండలం నాగోల్ కొండలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రెండు మాసాల క్రితం రాజేశ్వరీ తాను ప్రేమించిన యువకుడితో ఇంటి నుండి పారిపోయింది. అయితే ఈ విసయమై యువకుడిపై రాజేశ్వరీ పేరేంట్స్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహారాష్ట్రలో ఉన్న ఈ జంటను పోలీసులు తీసుకు వచ్చారు. ఇద్దరి పేరేంట్స్ కు వారిని అప్పగించారు.

also read:హైద్రాబాద్‌లో దారుణం: యువతిపై ప్రేమోన్మాది దాడి, యువతి మృతి

అయినా కూడా ఆ యువకుడినే వివాహం చేసుకొంటానని రాజేశ్వరీ  తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుందని స్థానికులు చెబుతున్నారు. అయితే అన్య మతానికి చెందిన ఆ యువకుడితో వివాహం చేయడానికి పేరేంట్స్ అంగీకరించలేదు. ఈ విషయమై పేరేంట్స్ తో యువతి గొడవ పెట్టుకుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇవాళ అనుమానాస్పద స్థితిలో యువతి రాజేశ్వరీ మరణించింది. అయితే రాజేశ్వరీ ఆత్మహత్య చేసుకొందని పేరేంట్స్ చెబుతున్నారు. అయితే రాజేశ్వరీని పేరేంట్స్ హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు