నాకు ఇచ్చినా, అప్పిరెడ్డికి ఇచ్చినా ఓకే...ఎన్నారైకి ఇస్తే చూపిస్తా: శంకరమ్మ ఆగ్రహం

Published : Nov 02, 2018, 06:04 PM ISTUpdated : Nov 02, 2018, 06:10 PM IST
నాకు ఇచ్చినా, అప్పిరెడ్డికి ఇచ్చినా ఓకే...ఎన్నారైకి ఇస్తే చూపిస్తా: శంకరమ్మ ఆగ్రహం

సారాంశం

తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి,టీఆర్ఎస్ నాయకురాలు శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే అమరవీరులకు అన్యాయం చేసినట్లవుతుందని వ్యాఖ్యానించారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్ అన్యాయం చేరని, ఆదుకుంటారని భావిస్తున్నట్లు శంకరమ్మ తెలిపారు. 

హైదరాబాద్: తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి,టీఆర్ఎస్ నాయకురాలు శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే అమరవీరులకు అన్యాయం చేసినట్లవుతుందని వ్యాఖ్యానించారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్ అన్యాయం చేరని, ఆదుకుంటారని భావిస్తున్నట్లు శంకరమ్మ తెలిపారు. 

శ్రీకాంతాచారి ఎప్పుడూ కేసీఆర్ ఫొటో చూసే లేచేవాడని గుర్తుచేశారు. కేసీఆర్‌ తమను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీద పోటీ చేయడమంటే సాహసమేనని చెప్పుకొచ్చారు. అయినా కేసీఆర్ సూచనను గౌరవించి పోటీ చేశానని వెల్లడించారు.
 
తనకు నియోజకవర్గంలో పార్టీ నుంచి సపోర్ట్ ఉందని శంకరమ్మ తెలిపారు. అయితే పార్టీతో సంబంధం లేని ఎన్నారై తనకు పోటీగా వస్తున్నాడని మండిపడ్డారు. మరోసారి సర్వే చేసి తనకు టికెట్ ఇవ్వాలని శంకరమ్మ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. 

కేసీఆర్ అన్యాయం చేయరనే అనుకుంటున్నానన్నారు. ఒకవేళ తనకు ఇవ్వడం కుదరకపోతే అప్పిరెడ్డికిచ్చినా అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. నియోజకవర్గంలో ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు, ముగ్గురు ఎంపీపీలు తమకు మద్దతిస్తున్నారని ప్రకటించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తమ్ కు కేసిఆర్ చెక్: హుజూర్ నగర్ బరిలో ఎన్నారై

ఉత్తమ్ పై పోటీ ఎవరు: ఎన్నారైకి టీఆర్ఎస్ సీటు దక్కేనా?

టీఆర్ఎస్ టికెట్ రాకుంటే ప్రాణత్యాగమే...ఆ మంత్రి వల్లే పెండింగ్ : శంకరమ్మ

‘‘నాకు టికెట్ ఇవ్వకుంటే.. సూసైడ్ చేసుకుంటా’’
 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం