మునుగోడు రిజల్స్ట్ : సీఎం కేసీఆర్ గ్రామంలో టీఆర్ఎస్ ఆధిక్యం.. ఎంతంటే...

Published : Nov 07, 2022, 09:18 AM IST
మునుగోడు రిజల్స్ట్ : సీఎం కేసీఆర్ గ్రామంలో టీఆర్ఎస్ ఆధిక్యం.. ఎంతంటే...

సారాంశం

రాష్ట్రవ్యాప్తంగా గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న మునుగోడు ఉపఎన్నిక ముగిసి టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గ్రామంలో టీఆర్ఎస్ ఎంత ఆధిక్యం సాధించిందంటే... 

చండూరు : మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా వ్యవహరించిన మర్రిగూడ మండలం లెంకలపల్లి ఎంపీటీసీ పరిధిలో టిఆర్ఎస్ అభ్యర్థికి 711 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక్కడ సహ ఇంఛార్జిగా ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వ్యవహరించారు. ఈ ఎంపీటీసీ పరిధిలో లెంకలపల్లి, సరంపేట గ్రామాల్లోని మూడు బూతులలో 4,009 మంది ఓటర్లు ఉండగా, 2,793 ఓట్లు పోలయ్యాయి. టిఆర్ఎస్ కు 1,610, బిజెపికి 899, కాంగ్రెస్ కు 95, బీఎస్పీకి 34, ఇతరులకు పోలయ్యాయి.  

కేటీఆర్  ఇన్చార్జిగా ఉన్న గట్టుప్పల్ లో 47 ఓట్ల ఆధిక్యం..
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గట్టుప్పల్  ఎంపీటీసీ-1కు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆయన పరిధిలో 3,360 మంది ఓటర్లు ఉండగా 3097 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టిఆర్ఎస్ కు 1359 కు ఓట్లు, బిజెపికి 1312 ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్ కు 47 ఓట్లు ఆధిక్యం లభించింది. మంత్రి కేటీఆర్ తరఫున పూర్తిగా సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆగయ్య ప్రచార బాధ్యతలు నిర్వహించారు.  

మునుగోడులో కాంగ్రెస్ దారుణ పరాజయంపై రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే?

మర్రిగూడ మండల కేంద్రానికి మంత్రి హరీష్ రావు ఇన్చార్జి వ్యవహరించారు. ఇక్కడ మూడు బూత్ లలో 2,785 మంది ఓటర్లు ఉండగా 2522 ఓట్లు పోలయ్యాయి. టిఆర్ఎస్ కు 1389, బిజెపికి 792,  కాంగ్రెస్ కు 174,  బీఎస్పీకి 37 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీజేపీపై టీఆర్ఎస్ కు 597 ఓట్ల ఆధిక్యం లభించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ