అనుయాయుడికి కీలక పదవి కట్టబెట్టిన కేసీఆర్

By Nagaraju penumalaFirst Published Aug 16, 2019, 6:32 PM IST
Highlights

తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బి.వినోద్ కుమార్ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. వినోనద్ కు కేబినెట్ హోదాతోపాటు కేబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన అనుచరుడుకు కీలక పదవి కట్టబెట్టారు. తెలంగాణ ఉద్యమం నుంచి వెన్నంటి నిలిచిన అనుచరుడకు కేబినెట్ హోదా కల్పించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బి.వినోద్ కుమార్ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. వినోనద్ కు కేబినెట్ హోదాతోపాటు కేబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తిస్తాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి ప్రతిపాదనలు తయారుచేసే కీలక బాధ్యతను వినోద్‌కుమార్‌కు సీఎం కేసీఆర్ అప్పగించారు.  

రాజకీయాల్లో, పరిపాలనా అంశాల్లో ఉన్న అనుభవంతో పాటు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాలపట్ల అవగాహన కలిగిన వినోద్‌కుమార్ సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో కరీనంగర్ లోక్ సభ నుంచి పార్లమెంట్ కు తిరిగి పోటీ చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో వినోద్ కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 

click me!