కరీంనగర్ కార్పోరేషన్ ఛైర్మెన్‌గా సునీల్ రావు

Published : Jan 29, 2020, 11:25 AM ISTUpdated : Jan 29, 2020, 11:50 AM IST
కరీంనగర్ కార్పోరేషన్ ఛైర్మెన్‌గా సునీల్ రావు

సారాంశం

కరీంనగర్ కార్పోరేషన్  ఛైర్మెన్ పదవికి సునీల్ రావు పేరును టీఆర్ఎస్ ఖరారు చేసింది. 


కరీంనగర్: కరీంనగర్ కార్పోరేషన్ ఛైర్‌పర్సన్, డిప్యూటీ ఛైర్మెన్ పదవులకు టీఆర్ఎస్ నాయకత్వం  పేర్లను ప్రకటించింది.  కరీంనగర్ మున్సిపల్ ఛైర్మెన్‌కు సునీల్ రావు, డిప్యూటీ ఛైర్మెన్‌గా చల్లా స్వరూపరాణి పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసింది.

కరీంనగర్ కార్పోరేషన్‌లో   ఎన్నికైన   కార్పోరేటర్లను  టీఆర్ఎస్ నాయకత్వం క్యాంపులకు పంపింది. ఇవాళ కార్పోరేషన్ ఛైర్మెన్, డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలు ఉన్నాయి. దీంతో క్యాంప్ నుండి నేరుగా  టీఆర్ఎస్ కార్పోరేటర్లు  నేరుగా కార్పోరేషన్‌ కార్యాలయానికి చేరుకొన్నారు.

కరీంనగర్  కార్పోరేషన్ లో విజయం సాధించిన 10 మంది ఇండిపెండెంట్లు ఇవాళ టీఆర్ఎస్‌లో చేరారు.  టీఆర్ఎస్‌కు చెందిన కార్పోరేటర్లతో   మంత్రి గంగుల కమలాకర్ బుధవారం నాడు సమావేశమయ్యారు.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే