మున్సిపల్ ఎన్నికలు 2020: ఎవరి ధీమా వాళ్లదే

By narsimha lodeFirst Published Dec 26, 2019, 6:39 PM IST
Highlights

మున్పిపల్ ఎన్నికల్లో తమకే ఎక్కువ సీట్లు వస్తాయని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో  టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు  ఘన విజయం సాధిస్తామని విశ్వాసంతో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని సత్తాను చాటుతామని మూడు పార్టీల నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ , టీఆర్ఎస్ పార్టీలకు సంతోషాన్ని కల్గించాయి. జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం కూటమికి ప్రజలు పూర్తి మెజారిటీని కట్టబెట్టారు. బీజేపీని ప్రజలు అధికారానికి దూరం చేశారు..

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు , హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కోల్పోయింది.అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు కావడం మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదని తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనే  అభిప్రాయంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్సీ ఎస్. రామచందర్ రావు అభిప్రాయపడ్డారు.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు కావడానికి ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీకి అత్యంత బలహీనమైన స్థానాల్లో హుజూర్‌నగర్ ఒకటని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. అయినా కూడ తాము ఈ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా ఆయన గుర్తు చేస్తున్నారు.

వచ్చే ఏడాది జనవరి మాసంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ గణనీయమైన మున్సిపల్ ఛైర్మెన్ పదవులను గెలుచుకొంటుందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకు వచ్చే ఏడాది జనవరి మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి.ఈ నిరసన కార్యక్రమాలు బీజేపీకి నష్టం కల్గించే  అవకాశం ఉందని కాంగ్రెస్, టీఆర్ఎస్ లు భావిస్తున్నాయి.

ఈ బిల్లులను కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు పార్లమెంట్‌లో వ్యతిరేకించాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయంగా తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. 

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆరేళ్లుగా అధికారంలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీల్లో కనీస సౌకర్యాలను కల్పించలేకపోయిందని  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు.

రోడ్లు, మౌళిక వసతులు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి వరంగల్, కరీంనగర్ సిటీలలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ నేత గూడూరు నారాయణరెడ్డి చెప్పారు.   


 

click me!