మోదీ నీ అబ్బ జాగీరా, రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వవు: కేసీఆర్ ఫైర్

By Nagaraju TFirst Published Nov 30, 2018, 3:35 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీని ఎందుకు రద్దు చెయ్యాల్సి వచ్చిందో గుట్టు విప్పారు తెలంగాణ ఆపద్ధర్మ  సీఎం కేసీఆర్. తెలంగాణను తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చెస్తుందని అది మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో అసెంబ్లీని రద్దు చేసి ప్రజల తీర్పుకోసం ముందస్తు ఎన్నికలకు వచ్చినట్లు తెలిపారు. 

పినపాక: తెలంగాణ అసెంబ్లీని ఎందుకు రద్దు చెయ్యాల్సి వచ్చిందో గుట్టు విప్పారు తెలంగాణ ఆపద్ధర్మ  సీఎం కేసీఆర్. తెలంగాణను తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చెస్తుందని అది మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో అసెంబ్లీని రద్దు చేసి ప్రజల తీర్పుకోసం ముందస్తు ఎన్నికలకు వచ్చినట్లు తెలిపారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా పినపాక నియోకవర్గం ముణుగూరులో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ వాస్తవానికి మరో నాలుగు నెలలు పాలన ఉండగా రద్దు చేసి బంగారు తెలంగాణ సాధించేందుకు ఎన్నికలకు వచ్చానని తమ తీర్పు ఆశిస్తున్నట్లు ప్రజలకు వివరించారు. 

పినపాక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కేసీఆర్ తెలిపారు. ఈ నియోజకవర్గాల పరిధిలో భద్రాద్రి పవర్ స్టేషన్ తీసుకొచ్చామన్నారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రం అమలు చెయ్యలేనటువంటి సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని కేసీఆర్ తెలిపారు. 

గతంలో అంగన్ వాడీ ఆశావర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి కార్యక్రమాలు చేశానని తెలిపారు. గత ప్రభుత్వాలు జీతాలు పెంచమని అంగన్ వాడీలు ఆందోళన చేస్తే గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు.  

కాంగ్రెస్, టీడీపీల 58 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశాయో గమనించాలన్నారు.  నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమం చేపట్టిందో గమనించాలన్నారు. ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ నేతలు టైం సరిపోలేదని చెప్తున్నారని అవకాశమిస్తే ఆరు చందమామలు, ఏడు సూర్యుళ్లు  పెడతామంటూ చెప్తున్నారని విమర్శించారు.  

గిరిజన బాయోం, ఆదివాసీ బాయోం అంటూ కాంగ్రెస్,టీడీపీ నేతలు కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. 58ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో ఏనాడైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. 

మంచి పని చేసేవారిని ప్రజలు ఆశీర్వదించాలని తమను ఆదరించాలని కేసీఆర్ కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 
ఆరు మాసాల లోపు చీఫ్ సెక్రటరీ, అటవీ శాఖ మంత్రి, అటవీ శాఖ అధికారులను తీసుకువచ్చి ఆక్రమించుకున్న పోడు భూములకు పట్టాలు అందజేస్తానన్నారు. ఇకపై పోడు భూములు నరకకొద్దన్నారు.  

తెలంగాణ గిరిజను రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ముస్లిం రిజర్వేషన్లు, గిరిజన రిజర్వేషన్లపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీకి ఎన్నో లేఖలు రాశానని ఇవ్వనని మోదీ చెప్తున్నారని స్పష్టం చేశారు. 

మోదీ నీ అబ్బ జాగీరా తెలంగాణ అంటూ మండిపడ్డారు. పెద్ద సమస్య అయిన తెలంగాణ రాష్ట్రాన్నే సాధించుకున్నామని అలాంటిది రిజర్వేషన్లు పెద్ద సమస్యే కాదని తెలిపారు. ప్రజలు ఆశీర్వదించి పినపాక టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లను గెలిపించాలని కోరారు.  
 

click me!