సుహాసినికి ప్రచారం: మరో ఐదు రోజులు హైదరాబాదులో చంద్రబాబు

Published : Nov 30, 2018, 02:48 PM IST
సుహాసినికి ప్రచారం: మరో ఐదు రోజులు హైదరాబాదులో చంద్రబాబు

సారాంశం

ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోమారు హైదరాబాద్ లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు రోజులపాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మరో ఐదు రోజులపాటు ప్రచారం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 

అమరావతి: ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోమారు హైదరాబాద్ లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు రోజులపాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మరో ఐదు రోజులపాటు ప్రచారం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 

రాజేంద్రనగర్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గణేష్ గుప్తా, కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి స్వయానా చంద్రబాబు మేనకోడలు నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారు. 

ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ విజయబాహుటా ఎగురవేసేందుకు చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే కూకట్ పల్లి నియోజకర్గంలో చంద్రబాబు రోడ్ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూకట్ పల్లి నియోజకవర్గ పర్యటన శనివారంకు వాయిదా పడింది. 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌