బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. రేపు ఆవిర్భావ సభ

Siva Kodati |  
Published : Dec 08, 2022, 05:58 PM ISTUpdated : Dec 08, 2022, 06:05 PM IST
బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. రేపు ఆవిర్భావ సభ

సారాంశం

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానంలో నూతన అధ్యాయం మొదలైంది. టీఆర్ఎస్ అధికారికంగా బీఆర్‌ఎస్‌గా మారింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఈసీ సమాచారం అందజేసింది. 

తెలంగాణ రాష్ట్ర సమితి ... భారత్ రాష్ట్ర సమితిగా అధికారికంగా మారింది. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం అందించింది. అక్టోబర్ 5న పార్టీ మార్పు కోరుతూ ఈసీకి టీఆర్ఎస్ దరఖాస్తు చేసుకుంది. పార్టీ మార్పుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.." భారత్ రాష్ట్ర సమితి " గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి టీఆర్ఎస్ అధినేత కెసిఆర్‌కు గురువారం అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో .. రేపు మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు "భారత రాష్ట్ర సమితి" ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో రేపు ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు కేసీఆర్ రిప్లై ఇవ్వనున్నారు. 

అనంతరం సీఎం కేసిఆర్ బిఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని కేసిఆర్ ఆదేశించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్