కంటోన్మెంట్ సమావేశం రసాభాస: టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నిరసనలు

Published : Apr 07, 2022, 05:10 PM IST
 కంటోన్మెంట్  సమావేశం రసాభాస: టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నిరసనలు

సారాంశం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో టీఆర్ఎస్, బీజేపీలు పోటా పోటీ నిరసనలకు దిగాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.   


హైదరాబాద్: సికింద్రాబాద్ Contonment బోర్డు సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలోనే TRS,BJP సభ్యులు పోటా పోటీ నిరసనలకు దిగారు.

కంటోన్మెంట్  సమావేశం గురువారం నాడు జరిగింది.  కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేత విషయమై రక్షణ శాఖ అవలంభించిన విధానాలపై టీఆర్ఎస్ సభ్యులు ప్రస్తావించారు. రోడ్లు మూసివేస్తే కంటోన్మెంట్ కు నీళ్లు, ఇతర సౌకర్యాలను కూడా కట్ చేస్తామని కూడా మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ విషయమై బీజేపీ సభ్యులు ప్రస్తావించారు.  ఈ వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు నిరసనకు దిగారు. రోడ్ల మూసివేతపై టీఆర్ఎస్ సభ్యులు కూడా నిరసనకు దిగారు. ఇరు వర్గాల సభ్యులు పోటా పోటీ నిరసనలకు దిగడంతో  కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో బీజేపీ సభ్యులను పోలీసులు రూమ్ లో నిర్భంధించారు. 

2021 ఫిబ్రవరి మాసంలో కంటోన్మెంట్ బోర్డు పాలకవర్గ సభ్యుల పదవీకాలం పూర్తైంది. అయితే ఏడాది పాటు ఈ పాలకవర్గం పదవులను పొడిగించారు. అయితే కంటోన్మెంట్ బోర్డులో కేంద్రం గత ఏడాది నవంబర్ మాసంలో  ఒక్క సభ్యుడిని నామినేట్ చేసింది. 

కంటోన్మెంట్ కు ఎన్నికలకు సంబంధించిన ఇంకా స్పష్టత లేనప్పటికీ ఇవాళ జరిగిన సమావేశంలో మాత్రం  రెండు పార్టీలు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?