
సిరిసిల్ల: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో మాకు పంచాయితీ లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తనకు తానే ఊహించుకొని గవర్నర్ మాట్లాడితే మేం ఏం చేయాలని కేటీఆర్ ప్రశ్నించారు.
గురువారం నాడు మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత Tamilisai Soundararajan మీడియాతో మాట్లాడారు. Telangana ప్రభుత్వం తనను అవమానపరుస్తుందన్నారు.ఈ వ్యాఖ్యలపై KTR స్పందించారు.
తనను ఇబ్బంది పెడుతున్నామని Governor చెప్పారని తాను విన్నానన్నారు. కానీ Narasimhan గవర్నర్ గా ఉన్న సమయంలో తమకు ఏనాడూ ఇబ్బంది రాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి విషయంలో తమను ఇబ్బంది పెట్టినందుకు గాను ప్రస్తుతం ఆమెను మేం ఇబ్బంది పెడుతున్నామని గవర్నర్ అనడం సరైంది కాదన్నారు. గవర్నర్ కాక ముందు తమిళిసై ఏ పార్టీ నాయకురాలో అందరికీ తెలుసునన్నారు.
ఢిల్లీకి తమిళిసై మంగళవారం నాడు చేరుకున్నారు. బుధవారం నాడు ప్రధాని మోడీతో గవర్నర్ భేటీ అయ్యారు. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.ఈ భేటీలు ముగిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనను అవమానపరుస్తుందన్నారు. తమిళిపై గా కాకుండా రాజ్ భవన్ ను గౌరవించాలని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినవన్నీ చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారంగానే తాను నడుచుకొంటానని ఆమె ప్రకటించారు.
గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈ విషయాలపై తెలంగాణ గవర్నర్ సమయం వచ్చినప్పుడల్లా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.
హూజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పేరుకు సిపారస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే కౌశిక్ రెడ్డి పేరుతో తెలంగాణ ప్రభుత్వం పంపిన ఫైలును గవర్నర్ తన వద్దే పెట్టుకొంది. కౌశిక్ రెడ్డిపై బీజేపీ సహా ఇతర పార్టీలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ప్రతిపాదించింది. గవర్నర్ కోటాలో మధుసూధనాచారికి టీఆర్ఎస్ సర్కార్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.
ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కూడా కేసీఆర్ సహా మంత్రులు హాజరు కాలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. అయితే తొలుత బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తనకు సమాచారం అందించిందని , ఆ తర్వాత పొరపాటున ఆ సమాచారం పంపారని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చిందని తమిళిసై ప్రకటించింది. టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించారని టీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. గవర్నర్ ప్రసంగం లేకండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడాన్ని కూడా విపక్షాలు తప్పుబట్టాయి.
రాజ్ భవన్ లో ఉగాది సంబరాలను గవర్నర్ నిర్వహించారు.ఈ సంబరాలకు కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం పంపింది. అయితే ఈ సంబరాలకు కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ కూడా హాజరు కాలేదు. సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరైన గవర్నర్ కు మంత్రులు స్వాగతం పలకలేదు.ప్రోటోకాల్ పాటించలేదు. ఈ సందర్భాలను పురస్కరించుకొని ఉగాది సంబరాల సమయంలో తాను ఎవరికీ కూడా తల వంచబోనని తమిళిసై స్పష్టం చేశారు. కేసీఆర్ సహా మంత్రులకు ఆహ్వానం పంపిన విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసింది.