సాగర్ బై పోల్: కాంగ్రెస్ సిద్ధం.. టీఆర్ఎస్‌‌ నిర్ణయంపైనే, బీజేపీ అభ్యర్ధి ఎంపిక

By Siva KodatiFirst Published Mar 27, 2021, 3:32 PM IST
Highlights

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. ఎల్లుండితో నామినేషన్‌ల పర్వం ముగియనుంది. అయితే ఇప్పటి వరకు ఒక్క కాంగ్రెస్ మాత్రమే అభ్యర్ధిని ప్రకటించింది. సీనియర్ నేత జానారెడ్డి బరిలో నిలిచారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. ఎల్లుండితో నామినేషన్‌ల పర్వం ముగియనుంది. అయితే ఇప్పటి వరకు ఒక్క కాంగ్రెస్ మాత్రమే అభ్యర్ధిని ప్రకటించింది. సీనియర్ నేత జానారెడ్డి బరిలో నిలిచారు.

టీఆర్ఎస్ , బీజేపీ ఇంకా అభ్యర్ధులను ప్రకటించలేదు. అయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య.. కంకణాల నివేదిత నామినేషన్ వేశారు. అభ్యర్ధిని బీజేపీ అధిష్టానం ఇంకా ఫైనల్ చేయలేదు.

సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్, ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ వుంది. కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధిని కూడా ప్రకటించింది. దీనిలో భాగంగా ఈరోజు సాయంత్రం భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రాజకీయంగా నువ్వానేనా అనే రీతిలో ఇరు పార్టీలు తలపడుతున్నాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఎలాగైన తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి వ్యవహారిస్తోంది. నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా జానారెడ్డి బరిలోకి దిగుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహయ్య విజయం సాధించారు.

నోముల హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని తిరిగి తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. నామినేషన్ల దాఖలకు ఈ నెల 30 వరకు గడువుంది. రాజకీయ కారణాలు, సామాజిక కోణాలను పరిగణనలోకి తీసుకుంటున్న టీఆర్ఎస్... తమ అభ్యర్ధులను అదే రోజు ప్రకటించాలని భావిస్తోంది.

అటు టీఆర్ఎస్ ప్రకటించే అభ్యర్ధిని బట్టి.. తమ అభ్యర్ధిని ప్రకటించాలని బీజేపీ యోచిస్తోంది. టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య తనయుడితో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితో పాటు అదే సామాజిక వర్గం నుంచి లైన్‌లో వున్నారు. వీరిలో ఎవరికి టీఆర్ఎస్ టికెట్ ఇస్తుందో చూసి.. దానికి భిన్నంగా మరో సామాజిక వర్గం నుంచి అభ్యర్ధిని ఎంపిక చేస్తే తమకు లాభిస్తుందని బీజేపీ ఎదురుచూస్తోంది. దీంతో ఇరు పార్టీల అభ్యర్ధుల ఖరారు, పేర్ల ప్రకటన చివరి రోజు వరకు తేలేలా కనిపించడం లేదు. 

click me!