ఇప్పపువ్వుకోసం వెళ్తే ఇరగ్గొట్టారు.. గిరిజనులపై పోలీసుల దాడి..

By AN TeluguFirst Published Mar 27, 2021, 1:57 PM IST
Highlights

నాగర్ కర్నూలు, అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ లో అమానుషం జరిగింది. ఇప్పపువ్వు కోసం వెళ్లిన గిరిజనులను ఫారెస్ట్ అధికారులు దారుణంగా కొట్టారు. మన్ననూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇప్పపువ్వు కోసం కొందరు గిరిజనులు వెళ్లారు. వీరిని అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా కొట్టారు. 

దీంతో పదిమంది గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దీంతో అటవీ అధికారులు ఆగకుండా ఆ గిరిజనులను మన్ననూర్ బేస క్యాంపులో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు పెద్ద సంక్యలో అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులమీద దాడి చేశారు. దీంతో గిరిజనుల దాడిలో పలువురు ఫారెస్ట్ అధికారులకు గాయాలు అయ్యాయి.

తమవారిమీద అటవీ అధికారులు దాడి చేయడాన్ని, తీవ్రంగా గాయపరచడం మీద గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల్నుంచి అటవీశాఖ సిబ్బంది తమను వేధిస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిలో దొరికే ఇప్పపువ్వు కోసం తాము వెళితే పోలీసులు అకారణంగా తమను గాయపరిచారని బాధితులు తెలిపారు. 

పోలీసుల దాడికి నిరసనగా గిరిజనులు పెద్ద సంఖ్యలో  జాతీయ రహదారిమీద ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిమీద పలు వాహనాలు నిలిచిపోయాయి. 

click me!