డ్రోన్ల సహాయంతో కరోనా వ్యాక్సిన్ పంపిణీ: వికారాబాద్‌లో నేడు ట్రయల్ రన్ ప్రారంభం

By narsimha lodeFirst Published Sep 9, 2021, 11:11 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో డ్రోన్ల సహాయంతో కరోనా మందులు,  కరోనా వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ట్రయల్ రన్ ను వికారాబాద్ జిల్లాలో గురువారం నాడు ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా డ్రోన్ల సహాయంతో కరోనా వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనుంది.

హైదరాబాద్: డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ట్రయల్ రన్ ను తెలంగాణ ప్రభుత్వం గురువారం నాడు ప్రారంభించనుంది కేసీఆర్ సర్కార్. ఈ నెల 9 నుండి 10వ తేదీ వరకు వికారాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ట్రయల్ రన్ నిర్వహించనుంది ప్రభుత్వం.

భూమికి 500 నుండి 700 అడుగుల ఎత్తులో డ్రోన్స్ ఎగురుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 11వ తేదీ నుండి డ్రోన్లు భూమికి  9 నుండి 10 కి.మీ. ఎత్తులో ప్రయాణిస్తాయి.  డ్రోన్లు కరోనా వ్యాక్సిన్లతో పాటు ఇతర మండులను  సరఫరా చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కోసం బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ డ్రోన్ల వినియోగిస్తున్న  రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించనుంది. ఈ నెల 11వ తేదీ నుండి డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ సహా మందులను సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం కూడ డ్రోన్ల సహాయంతో కరోనా వ్యాక్సిన్ సరఫరాను ప్రారంభించింది.  దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో  డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రాథమికంగా చర్యలు తీసుకొంది. హెచ్ఐఎల్ ఇన్ ఫ్రా టెక్ సర్వీసెస్ లిమిటెడ్ ఐసీఎంఆర్ తరపున దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మానవ రహిత ఏరియల్  వెహికల్ ద్వారా మెడికల్ కిట్స్, కరోనా వ్యాక్సిన్ సరఫరా కోసం టెండర్లను ఈ ఏడాది జూన్ మాసంలో ఆహ్వానించింది.

కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్ల వినియోగం కోసం  డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ఏడాది ఆరంభంలో షఁరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. 

click me!