నాగర్ కర్నూలు జిల్లాలో భూకంపం: భయంతో పరుగులు తీసిన ప్రజలు

By telugu teamFirst Published Jul 26, 2021, 9:24 AM IST
Highlights

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనలతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.

నాగర్ కర్నూలు: తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకుంది. రెండు సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరగులు తీశారు. ఈ ప్రకంపనలు సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకున్నాయి.

నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, ఆమ్రాబాద్, ఉప్పునుంతల, లింగాల గ్రామాల్లో భూమి కంపించింది. ఈ భూకంపం రెక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సంబంధిత అధికారులుచెప్పారు. 

భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించిన సమాచారం ఏదీ లేదు.

click me!