కన్న కొడుకు, కూతురిపైనే అఘాయిత్యం.. ఓ తండ్రి దుర్మార్గం.. !

Published : Jul 26, 2021, 09:20 AM IST
కన్న కొడుకు, కూతురిపైనే అఘాయిత్యం.. ఓ తండ్రి దుర్మార్గం.. !

సారాంశం

గత కొంతకాలంగా కూతురు, కుమారుడు అన్యమనస్కంగా ఉంటుండంతో ఆందోళన చెందిన తల్లి సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించగా మూడేళ్ల క్రితం తమపై తండ్రితో పాటు అతడి స్నేహితుడు అసభ్యకరమైన ప్రవర్తనకు పాల్పడ్డట్లు తేలింది. 

కన్నకొడుకు, కూతురుపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ తండ్రిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు (45) జూబ్లీహిల్స్ రోడ్ నెం. 70లో నివాసం ఉంటాడు. అతడికి 2003లో వెంకటగిరికి చెందిన మహిళ (40)తో వివాహం జరిగింది.

అమెరికాలో ఉండే ఈ దంపతులు 2010లో నగరానికి తిరిగి వచ్చారు. వీరికి కూతురు (14), కొడుకు (11) ఉన్నారు. 2018లో కుటుంబ కలహాల కారణంగా భార్యభర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా కూతురు, కుమారుడు అన్యమనస్కంగా ఉంటుండంతో ఆందోళన చెందిన తల్లి సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించగా మూడేళ్ల క్రితం తమపై తండ్రితో పాటు అతడి స్నేహితుడు అసభ్యకరమైన ప్రవర్తనకు పాల్పడ్డట్లు తేలింది. 

ఎవరూ లేని సమయంలో తన శరీర భాగాలను తాకుతూ తండ్రి, అతని స్నేహితుడు (45) అసభ్యంగా ప్రవర్తించారన కూతురు చెప్పగా తనను నగ్నంగా చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడని కుమారుడు చెప్పుకొచ్చాడు. దీంతో తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ఆదివారం రిమాండ్ కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!