మీ ఫ్రెండ్స్ మందుకి, డ్రగ్స్‌కు బానిసలయ్యారా? అయితే మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ మాటలు తప్పకుండా వినాల్సిందే..! హైదరాబాద్‌లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి యువతకు కీలక సందేశం ఇచ్చారు. తన సినీ ప్రయాణం ప్రారంభంలో ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. లక్ష్యంపై దృష్టి పెట్టడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైన స్నేహితులను దూరం పెట్టకుండా, వారికి అండగా నిలిచి వ్యసనం నుంచి బయటపడేలా సహాయం చేయాలని సూచించారు.