ఎస్పీ దాతృత్వం.. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సాయం.. (వీడియో)

Published : Jan 22, 2021, 01:15 PM ISTUpdated : Jan 22, 2021, 01:16 PM IST
ఎస్పీ దాతృత్వం.. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సాయం.. (వీడియో)

సారాంశం

రాజన్న సిరిసిల్ల ఎస్పీ జిల్లాలో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే అందరికంటే ముందు ఉంటున్నారు. కరోనా సమయంలో కూడా జిల్లాలో ఉన్న ఎందరో వలస కార్మికులకు రెండు నెలలకు సరిపడా నిత్యావసరసరకులను అందిస్తూ వాళ్లందరికీ ఎటువంటి ఇబ్బందిరాకుండా  చూసుకున్నారు. 

రాజన్న సిరిసిల్ల ఎస్పీ జిల్లాలో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే అందరికంటే ముందు ఉంటున్నారు. కరోనా సమయంలో కూడా జిల్లాలో ఉన్న ఎందరో వలస కార్మికులకు రెండు నెలలకు సరిపడా నిత్యావసరసరకులను అందిస్తూ వాళ్లందరికీ ఎటువంటి ఇబ్బందిరాకుండా  చూసుకున్నారు. 

"

వాళ్లకు ఏదైనా అవసరం వస్తే జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందేలా ఏర్పాట్లు చేసి వాళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చేలా చేసి జిల్లా ప్రజల ప్రేమ చూరగొన్నారు.

ఆ మధ్య జిల్లా కేంద్రం సిరిసిల్లలో తల్లిదండ్రులు చనిపోయిన ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారన్న విషయం స్థానిక విలేఖరుల ద్వారా తెలుసుకొని తానే స్వయంగా ఒక ఇల్లు కట్టించి ఇచ్చి ఆ అనాధలకు ఒక ఆశ్రయం కల్పించారు. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి స్వయంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ను అభినందించారు. 

మళ్ళి తాజాగా సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మ్యాకల లక్ష్మి, రామయ్య ల పెద్ద కొడుకు రాహుల్ (27) అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ, రేపో మాపో చావు కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆ కుటుంబానికి తన సొంత డబ్బు 50,000 రూపాయల నగదును అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. 

అంతేగాక ఆ కుటుంబానికి 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. హైదరాబాద్ లోని కొందరు డాక్టర్ లతో మాట్లాడి మంచి వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చి, వెంటనే హైదరాబాద్ లో ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఎవరి ఏ ఆపద వచ్చినా  స్వయంగా ఎస్పీ ఏ ముందుండి సహాయం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా