క్షుద్రపూజలో వాడిన కోడిగుడ్డు, నిమ్మకాయ తిన్న పోలీస్.. ఎందుకంటే...

By SumaBala BukkaFirst Published Mar 15, 2022, 2:03 PM IST
Highlights

క్షుద్రపూజలో వాడిన నిమ్మకాయ, కోడిగుడ్డు దాటితే అరిష్టమని.. ఏదో జరిగిపోతుందని మూఢనమ్మకం తరతరాలుగా పాతుకుపోయింది. దాన్ని పోగొట్టడానికి వరంగల్ లోని ఓ ట్రాఫిక్ పోలీస్ వినూత్న ప్రయోగానికి తెరతీశాడు.

వరంగల్ : ఓ పక్క టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మరోవైపు Superstitionకు ముగింపు పలకలేక పోతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో చేతబడులు, Occult worship పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా Mahabubabad జిల్లా కాకతీయ కాలనీలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. దీంతో భయాందోళనలతో కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుద్రపూజలను భగ్నం చేసి.. హిజ్రాతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు Warangal పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆది, బుధవారాల్లో కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారు. రోడ్డుపై Eggs, coconuts, lemons ఉండడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు బ్రిడ్జి మీద పూజలు చేసి వదిలేసిన కొబ్బరికాయలు, కోడిగుడ్లు, నిమ్మకాయలు, పూజా సామాగ్రిని ఒక్క చోటకు చేర్చారు. ప్రజలు చూస్తుండగానే నారాయణ అనే హోంగార్డ్ కోడిగుడ్డును గుటుక్కున మింగేశాడు. కొబ్బరికాయ పగలగొట్టి ఆ కొబ్బరినీళ్లని తాగాడు. అంతేకాదు పూజలు చేసిన ఆ నిమ్మకాయలను కోసి నిమ్మరసం తాగేశాడు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 7న సూర్యాపేటలో క్షుద్రపూజల కలకలం రేగింది.సమాజంలో ఆధునికత పెరిగినప్పటికీ.. మారుమూల పల్లెలు, Rural areaల్లో ఇంకా Superstitions స్వైర విహారం చేస్తున్నాయి. ఏదో జరిగిపోతోంది. ఏదో రాబోతోందన్న అన్న నమ్మకాన్ని కేటుగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. ఈ నేపత్యంలోనే Telanganaలోని Suryapeta జిల్లా చిలుకూరు చెమ్నారిగూడంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఓ ఇంట్లో గుంతలు తీసి, పసుపు, కుంకుమలతో పూజలు చేసిన దృశ్యాలు సంచలనంగా మారాయి.

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో చెమ్నారిగూడెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇంట్లో దోషం ఉందని, పూజలు చేయకపోతే ప్రాణ నష్టం కలుగుతుందని నమ్మించి శేషాచార్యులు అనే వ్యక్తి ఈ ఘటనలకు పాల్పడుతున్నాడు. అంతే కాకుండా ఇంట్లో బంగారం ఉందని, వెలికి తీస్తానని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు. ఇళ్లల్లో గుంతలు తీసి పూజలు చేస్తున్నాడు. తీరా తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. చివరికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. 

click me!